Showing posts with label $ క - ఘ. Show all posts
Showing posts with label $ క - ఘ. Show all posts

కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేలా

కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా ||కనులు||

చరణం 1

పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది
ఐతేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదనీ ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ ఙాపకాలె నా ఊపిరైనవని ||కనులు||

చరణం 2

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టూ నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రసవీయమంది

కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

$కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ ||కరిగేలోగా||

చరణం 1

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా ఇట్టే విడదీసే వీలుందా ||కరిగేలోగా||

చరణం 2

అడిగినవన్ని కాదని పంచిస్తూనే మరునిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటను చూస్తుంటే నా బాధంటటి అందంగా ఉందే
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే మరుజన్మే ఓ క్షణమైనా చాలంటే ||కరిగేలోగా||

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్ల లన్నవే ఎరుగని వేగం తో వెళ్ళు

చరణం 1

లయకే నిలయమై నీపాదం సాగాలి
మలయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేది
తిరిగే కాలానికీ ఆ...
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటా జూటి లోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది
విలువేముందీ..

చరణం 2

దూకే అలలకూ ఏ తాళం వేస్తారు
ఆహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది
విలువేముందీ...

ఒక కొమ్మకు పూచిన పువ్వులం...

ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము ||ఒక కొమ్మకు||
అన్నయ్యా... నీవేను నా ప్రాణము
ఓ అన్నయ్యా... నీతోటిదే లోకము

చరణం 1

మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు
పలికించె నాలో రాగాల వీణ
మా అన్న చూపు మేఘాల మెరుపు
కురిపించె నాలో పన్నీటి వాన
ఇది కరగని చెరగని కలగా ఎద నిలిచెనులే కలకాలం
చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించునులే చిరకాలం
ఈ బంధం సాగేను ఏనాటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికీ

చరణం 2

మా ఇంటి పంట చిన్నారి చెల్లి మాకంటి పాప బంగారు తల్లి
ఈ చోట ఉన్నా ఏచోట ఉన్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా
మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ...
||ఈ బంధం|| ||ఒక కొమ్మకు||

గున్నమామిడి కొమ్మమీద...

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ||2||
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది.. ||గున్నమామిడి||
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చరణం 1

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపినది ||2||
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల ||గున్నమామిడి||

చరణం 2

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ||2||
రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి ||గున్నమామిడి||
||గున్నమామిడి|| ||2||

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలువదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! ||గుండెల్లో||
మనసా మనసా మనసా ఓ మనసా... ||3||

చరణం 1

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది..
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది..
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతుంది
కన్నులేదాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో.. ఇదంతా.. నిజంగా కలలాగే ఉంది! ||గుండెల్లో||

చరణం 2

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది..
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది..
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! ||గుండెల్లో||
మనసా మనసా మనసా ఓ మనసా... ||3||

కనుపాప కరవైన కనులెందుకో...

కనుపాప కరవైన కనులెందుకో
తనవారె పరులైన బ్రతుకెందుకో ||కనుపాప||

చరణం 1

విరజాజి శిలపైన రాలేందుకే
మరుమల్లె కెంధూళి కలిసేందుకే ||విరజాజి||
మనపైన చినదాని మనసిందుకే
రగిలేందుకే ||కనుపాప||

చరణం 2

అలనాటి మురిపాలు కలలాయెనా
చిననాటి కలలన్ని కధలాయెనా ||అలనాటి||
తలపోసి తలపోసి కుమిలేందుకా
కనువిందుకా ||కనుపాప||

చరణం 3

తన వారు తనవారె విడిపోరులే
కనుమూసి గగనాన కలిసేరులే ||తనవారు||
ఏనాటికైనాను మనపాట మిగిలేనులే
కలకాలమీ గాధ రగిలేనులే ||2||
రగిలేనులే ||కనుపాప||

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ...

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ
పొగరాని కుంపట్లు రగిలించినావే
పొగరెత్తి చలిగాణ్ణి తగిలేసినాడే
చెమ్మ చెక్క చేత చిక్క
మంచమల్లె మారిపోయే మంచుకొండలు
మంచిరోజు మార్చమంది మల్లెదండలు ||కాశ్మీరు||

చరణం 1

తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారి పోయాక పొదచేరుకో
గుండెలో నే పాగ చుట్టుగా వేశాక గుత్తమైన సోకు నీదే కదా
అరె తస్సచెక్కా ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళికాక ముందే జరిగే పేరంటము ||కాశ్మీరు||

చరణం 2

సిందూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో
పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీర చిలకమ్మా కసి చూసుకో చిలకపచ్చ రైక దిగి చూసుకో
గూటి పడవల్లోన చాటుగా కలిశాక
తీటికైన వేడి పుట్టాలిలే పూత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు ||కాశ్మీరు||

గోరువంక వాలుగానె గోపురానికి...

గోరువంక వాలుగానె గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలా కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే.. వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే.. వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసి అందమైన బాలుడే తనవాడై... ||గోరువంక||

చరణం 1

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన...
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల్లా పడ్డట్టున్న
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపమలంటా దిక్కుల్లో..
ఎవరికి వారే... ఏ... యమునకు తీరే..
రేవు నీరు నావదంట
నావ తోడు రేవుదంట పంచుకుంటే... ||గోరువంక||

చరణం 2

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన పూలసొగసల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వె సిగ్గందాల పిల్లనవ్వె
బాలయ్యొచ్చి కోలాటాడె వేళల్లో
పైరందాల చేలు నవ్వె పేరంటాల పూలు నవ్వె
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడె పొద్దుల్లో
పరవశమేదో ఓ... పరిమళమాయె... ఏ... ఓ...
పువ్వు నవ్వె దివ్వె నవ్వె
జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే... ||గోరువంక||

కన్నెపిల్లవని కన్నులున్నవని...

తన్న తన్ననన తన్న తన్ననన
తన్నాన ననన తనతన తన్నాన ఓహో
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల్లలల్లలల లల్లలల్లలల లల్లల
లల్లల లాలలాల లాలాలా
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ ||కన్నె||

ఏమంటావ్... ఊ...
ఉహు... సంగీతం...
నన్నానా... ఉ... నువ్వైతే...
రీసరీ... సాహిత్యం ఊహు... నేనౌతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా ||కన్నె||

చరణం 1

ననననాన సే ఇట్ వన్స్ ఎగైన్‌
ననననాన... స్వరము నీవై...
తరనన తరరనన
స్వరమున పదము నేనై ఓకే
తానే తానే తానా... గానం గీతం కాగా
తరనతన... కవిని నేనై
తానా ననన తానా... నాలో కవిత నీవై
నాన నాననా లలలా తనన తరన
కావ్యమైనదీ తలపో పలికే మనసో ||కన్నె||
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా...

చరణం 2

ఇప్పుడు చూద్దాం...
తనన తనన తన్న...
ఉహూ... తనన తనన అన్నా...
తాన తన్న తానం తరనా తన్న
తాన అన్న తాళం ఒకటే కదా
అయ్య బాబోయ్...
తనన తాన తాన నాన తాన ఉహ్...
పదము చేర్చి పాట కూర్చలేదా శభాష్
దనిని దససా అన్నా నీదా అన్నా
స్వరమే రాగం కదా
నీవే నేనని అన్నా మనమే కాదా ||2||
కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను రువ్వి రువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని ||కన్నె||

హరే రామ హరే రామ రామ రామ హరే హరే...

గోవింద బోలోహరి గోపాల బోలో ||2||
రాధా రమణ హరి గోపాల బోలో ||2||
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

చరణం 1

చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్‌మతి ప్రేమ స్మృతికీ బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పద పదమని..
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దాం మిత్రమా

చరణం 2

ఓం సహనాభవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినామధీతమస్తు మావిద్విషావహై
పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా
పద పద పద పదమని..

ఘల్లుఘల్లున గుండె ఝల్లున...

ఘల్లుఘల్లున గుండె ఝల్లున
పిల్ల ఈడు తుళ్లిపడ్డది
మనసు తీరగ మాటలాడక
మౌనం ఎంచుకున్నది ||ఘల్లు||

చరణం 1

క్షణమాగక తనువుగెను
ఈ సంధ్యా సమీరాలలో...
అనురాగమే తలవూపెను
నీలాకాశ తీరాలలో ||క్షణమాగక|| ||ఘల్లు||

చరణం 2

కలగీతమై పులకించెను
నవ కళ్యాణ నాదస్వరం
కధ కానిది తుది లేనిది
మన హృదయాల నీరాజనం ||కలగీతమై|| ||ఘల్లు||

కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే...

కుకుకు కుకుకు కుకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ||2||
రాణివాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలెందుకో కో కో
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ...

చరణం 1

రంగులలోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరులా తెరలే తెరచీ రావే
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో ||2||
స్వరమై రావే విరపొదల ఎదలకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ...

చరణం 2

సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు గిరుజు విడిచి రావే
గడపా తలుపూ దాటిరావే
నువ్వేలే రాజ్యం వుంది ఆ నాలుగు దిక్కులలో ||2||
లయగా రావే ప్రియ హృదయజతులతో ||కుకుకు కుకుకు||

కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా...

కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా
కచ్చకట్టీ కత్తిపడితే చిచ్చురేపే కాళివమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే
దూసిన కత్తి వణికిపోవునమ్మా
కుంచె పట్టి బొమ్మగీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా
అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా
ఆలన పాలనలో నువ్వే
ఈ నేలకు తల్లివమ్మా
నువ్వు పలికేదే తిరుగులేని వేదం
నువ్వు చేసేదే ఎదురులేని చట్టం
ఓర్పులోన ధరణి మాతవమ్మా
తీర్పులోన ధర్మమూర్తివమ్మా
జేజెమ్మా మాయమ్మా
జేజెమ్మా జేజెమ్మా మా జేజెమ్మా ||జేజెమ్మా||
నువ్వు రుద్రరూపమెత్తగానే
కాలమే దద్దరిల్లి పోయేనమ్మా
రుద్రశక్తులకు నీ ధాటితో
గుండెలే బద్దలైపోయేనమ్మా
బుసగొట్టే కామాంధుని కసితీరక తొక్కావమ్మా
పుట్టుగడ్డ ఆదుకున్న ఆ అపర భద్రకాళి నీవమ్మా
మాటనిలుపుకొంటివమ్మా జేజెమ్మా
మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా
ఎంత దీక్ష పూనినావమ్మా
గుండెలో నిప్పులే నింపినావమ్మా
త్యాగమంటే నీదమ్మా
నరకమే కొంగులోన ముడిచావమ్మా
నిన్నుచూసి మృత్యువుకే జేజెమ్మా
కళ్లు చెమ్మగిల్లినాయమ్మా
ఈ జారుతున్న రక్తధారలే
నీ తెగువకు హారతులు పట్టేనమ్మా
ఆ... ఆ... దిక్కులన్నీ శూన్యమాయే
వెలుతురంతా చీకటాయే
ఆశలన్నీ ఇంకిపోయే
శ్వాస మాత్రం మిగిలిపోయే

గాంధీ పుట్టిన దేశం...

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం ||2|| ||గాంధీ||
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్‌

చరణం 1

భేదాలన్నీ మరచీ మోసం ద్వేషం విడిచి ||2||
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి ||2|| ||గాంధీ|| ||రఘుపతి||

చరణం 2

ప్రజలకు శాంతి సౌఖ్యం
కలిగించే దేశమె దేశం ||2||
బానిస భావం విడనాడి
ఏజాతి నిలుచునో అదిజాతి ||2||
బాపూ.. నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు ||2|| ||గాంధీ|| ||రఘుపతి||

కనులే కలిపే కధలే తెలిపే నాలోని భావాలే

కనులే కలిపే కధలే తెలిపే నాలోని భావాలే
అలలే మెదిలే కలలే కదిలే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో ||కనులే||

చరణం 1

మనసునే తొలి మధురిమలే వరించగా
బ్రతుకులో ఇలా సరిగమలే రచించగా
స్వరములేని గానం మరపురాని వైనం
మౌన వీణ మీటుతుంటే కలవరమాయే మదిలో

చరణం 2

ఎదగనీ కలే ఎదలయలో వరాలుగా
తెలుపనీ అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీరం మధురమైన భారం
గుండె ఊయలూపుతుంటే కలవరమాయే మదిలో ||కనులే||

కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే

సా... నిసరీసాని... సా నిసమగామరి
పదసా... నిసరీసాని...
సా... నిసమగామరి
పదసససని రిరిరిన గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని...
కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురసవాణి... కీరవాణి... ||చిలకల||

చరణం 1

గరిస పమగ పాని సరిగ రిగస నీద...
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే...
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే... కీరవాణి
చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన
మంజులవాణి ||కీరవాణి||

చరణం 2

నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే ||కీరవాణి||

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో

ఆ... ఆ... ఆ... ఆ...
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి
అంతలోనే మౌనమేలనే ||కొంటె||
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు ||2||
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది

చరణం 1

పగలే రేయైనా యుగమే క్షణమైనా
కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది ||కొంటె||

చరణం 2

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత ||కళ్ళు|| ||మాటరాని||
కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే ||చిన్ని||

కనులు తెరిచినా నీవాయే...

సాకీ
సన్నగ వీచే చల్లగాలికీ
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై ఆ...
కలలో వింతలు కననాయే ||సన్నగ||
అవి తలచిన ఏమో సిగ్గాయే

పల్లవి

కనులు తెరిచినా నీవాయే...
నే కనులు మూసినా నీవాయే ||కనులు||

చరణం 1

నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే ||2||
కలవరపడినే కనులు తెరువ నా కంటిపాపలో నీవాయే
ఎచట చూచినా... నీవాయే ||కనులు||

చరణం 2

మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే ||2||
ఉలికిపాటుతో కలయ వెదక నా హృదయ ఫలకమున నీవాయే
కనులు తెరిచినా నీవాయే...
కనులు మూసినా నీవేనాయే

గోరే గోరే గొగ్గోరే గోరే...

గోరే గోరే గొగ్గోరే గోరే...
గోరే గోరే గొగ్గొరే... ||3||
గో... గో... గో...
పో పో పొమ్మంటోందా నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా ||పో పో...||
చూస్తు చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీవల్ల
ఇదనా అదనా ఎద ఏమన్నా
తెలిసే వీలుందా ||గోరే...||

చరణం 1

తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం ||తెగ||
ముళ్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళీ పడదా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం పలికుండదే మమకారం
ఔనా.. అయినా..
నన్నే అంటావే నేరం నాదా ||గోరే...||

చరణం 2

వెంటపడుతుంటే వెర్రి కోపం నువు కంటపడకుంటే పిచ్చితాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పవే సమయం ||వెంట||
నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా ||గోరే...||