Showing posts with label * ఎయం.రాధకృష్ణన్. Show all posts
Showing posts with label * ఎయం.రాధకృష్ణన్. Show all posts

నువ్వేనా నా నువ్వేనా

పల్లవి

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చే సుప్రభాతవేళ
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆనందమేనా

చరణం 1

మేఘమల్లే సాగివచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా.. కన్నీరేనా..
తేనెటీగ లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన
దారమల్లే దాగుతావు నేనేనా నీ రూపేనా

చరణం 2

కోయిలల్లే వచ్చి ఏదో
కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం.. ఇది ఏ తాళం..
మసక ఎన్నెలల్లే నీవు ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత
గుసగుసల్లే మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా