అందమె ఆనందం...

అందమె ఆనందం అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం ||2||

చరణం 1

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం ||2||
ఒడిలో చెలి మోహనరాగం ||2||
జీవితమే మధురానురాగం ||2|| ||అందమె||

చరణం 2

పడిలేచే కడలితరంగం ఓ...
పడిలేచే కడలితరంగం
వడిలో జడసిన సారంగం ||2||
సుడిగాలిలో ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం ||2|| ||అందమె||
ఓ... ఓ... ఓ...