హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి... ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదో ఇచ్చి... వచ్చెయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవా ప్రతాపా
బెదరకే పాపా... వదలని కైపా
మన కనపడి కలవరపడి తెగ ఎగసిన
మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి కీడెంచి మేలెంచి ||హల్లో అంటూ||
చరణం 1
ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు
దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరినేమారుస్తాం... ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం...
మన్మధ మంత్రం వేద్దాం
రేయిలాంటి మైకం కప్పుకొని ఉందాం
మాయదారి లోకం కంట పడదందాం
మన ఏకాంతం... మనకే సొంతం
అష్ట దిక్కులన్ని దుష్ఠ శక్తులల్లే కట్టకట్టుకొచ్చి
చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం
అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం...
ముద్దుల్లో ముంచేద్దాం ||ఆరాతీసేవాళ్ళు||
చరణం 2
పిల్లకి మెళ్ళో పుస్తె కట్టేదెప్పుడంట
పిల్లికి మెళ్ళో గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవె చిట్టీ... చంపకు ఊదరగొట్టి
దగ్గిర దగ్గిర ఉండి... తగ్గదు బాదర బంది
ఆవురావురందీ ఆకలాగనంది
ఆవిరెక్కువుంది అంటుకోకు అందీ
తట్టుకోడమెల్లా... ముట్టుకుంటే డిల్లా
విస్తరాకు నిండ విస్తరించి ఉన్న
నిన్ను చూసి కూడా పస్తులుండమని
ఎవ్వరిది శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం అయినా
పెడతా శాపం ||హల్లో అంటూ||
Showing posts with label - భార్గవి. Show all posts
Showing posts with label - భార్గవి. Show all posts
Subscribe to:
Posts (Atom)