Showing posts with label * బెల్లీ రాజ్‌. Show all posts
Showing posts with label * బెల్లీ రాజ్‌. Show all posts

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో

ఆ... ఆ... ఆ... ఆ...
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి
అంతలోనే మౌనమేలనే ||కొంటె||
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు ||2||
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది

చరణం 1

పగలే రేయైనా యుగమే క్షణమైనా
కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది ||కొంటె||

చరణం 2

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత ||కళ్ళు|| ||మాటరాని||
కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే ||చిన్ని||