పల్లవి
[అతడు] గామా గామ హంగామా మనమే హయి చిరునామా
పాత బాధ గదిని ఖాళి చేద్దామా
[ఆమె] గామా గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా
మొత్తం సంతోషం జమ చేద్దామా ||గామా||
చరణం 1
[అతడు] నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో శిల్పం
కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన
కోరిక కలిగింది ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని
మళ్ళీ రాయిని చెయ్యెద్దని ||గామా||
చరణం 2
[అతడు] నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకం వచ్చింది
నీ స్పూర్తితో ఎంతో సాధించాలని తపనే పెరిగింది నీ చెలిమితో ఊహల్లోనా
ఊరిస్తున్నా గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్నా
మనస్సే మురిసింది ఆ మనస్సు అలిసి పోరాదని ఈ చెలిమి
నిలిచి పోవాలని ఇలా బ్రతుకును గెలవాలని ||గామా||
Showing posts with label * శ్ర్రీవర్దిని. Show all posts
Showing posts with label * శ్ర్రీవర్దిని. Show all posts
Subscribe to:
Posts (Atom)