Showing posts with label * ఉదిత్ నారాయణ్. Show all posts
Showing posts with label * ఉదిత్ నారాయణ్. Show all posts

పడ్డానండి ప్రేమలో మరి...

సాకీ:

నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది
అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యిందీ

పల్లవి

పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది ||2||
నిజంగా... నిజంగా...
ఇలా ఈ రోజే తొలిసారిగా ||పడ్డానండి||

చరణం 1

ఈ కాంతలోన దాగి వుంది అయస్కాంతము
తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము
నీ చేతిలోన దాగి వుంది మంత్రదండము
నువు తాకగానె చెంగుమంది మగువ దేహము
ఇద్దరిదీ ఇదే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ||2||
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ ||పడ్డానండి||

చరణం 2

నా ఈడు నేడు పాడుతోంది భామదండకం
నా ఒంటినిండ నిండి ఉంది ఉష్ణమండలం
నాపాత పెదవి కోరుతోంది కొత్తపానకం
నా అందమంత చూపమంది హస్తలాఘవం
కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి ||2||
వయసులోన ఉన్నోళ్ళకు తప్పదీ స్వయంకృషి ||పడ్డానండి||

చెప్పవే చిరుగాలి...

చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి ||2||
ఎక్కడే వసంతాల కేళి.... చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ... ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి

చరణం 1

ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే... హో... అడుగే అలై పొంగుతుంది
ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ....
చుట్టూ ఇంకా రేయున్నా... అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరిపోయే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే...
ఆపగలవ చీకట్లూ...
కురిసే సుగంధాల హోళీ... ఓ...
చూపదా వసంతాల కేళి ||కురిసే|| ||చెప్పవే||

చరణం 2

యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళా... హో... చెవిలో సన్నాయి రాగంలా
ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ....
కలలే నిజమై అందేలా... ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఈదరి ఆదరి ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా...
పొద్దే పలకరించాలి...
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ... ఓ...
చూపదా వసంతాల కేళి ||ఉపిరే|| ||చెప్పవే||

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ...

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ||2||
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులూ.. ఈ చూపులూ..
ఆ నవ్వులూ ఈ చూపులూ కలిపేస్తే ప్రేమేలే ||అమ్మాయే||

చరణం 1

ప్రేమలు పుట్టే వేళా పగలంతా రేయేలే
ప్రేమలు పండే వేళా జగమంతా జాతరలే
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే
నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చి మిరపైన నా నోటికి నారింజే
ఈ వయసులో.. ఈ వరసలో.. ||2||
నిప్పైనా నీరేలే ||అమ్మాయే||

చరణం 2

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖచిత్రం...
అమ్మమ్మో
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం...
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో
నీ తలపే రవి కిరణం
పులకింతలే.. మొలకెత్తగా.. ||2||
ఇది వలపుల వ్యవసాయం ||అమ్మాయే||

నా మనసుకేమయింది నీ మాయలో పడింది

నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా... తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా... లోలోపల
మన ఇద్దరికీ తెలియంది
ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా మది ఉలికి పడుతువుంది ||నా మనసుకే||

చరణం 1

చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందదా
నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో
చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని ||నా మనసుకే||

చరణం 2

ఎప్పుడూ గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ
కళ్లలో ఉన్న నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవ్వరు
కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కధని ||నా మనసుకే||

ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా

ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరవలేని ఇంద్రజాలం
వానలోన ఇంత దాహం ||ఏమైందీ||

చరణం:1

చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ
వెలవెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడిపి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే ||ఏమైందీ||

చరణం:2

ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే
ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటిసారి మెరుపు చూశా
కడలిలాగే ఉరకలేశా ||ఏమైందీ||

రారా . . . రారా

పల్లవి

[అతడు] రారా ... రారా ఎక్కడ పోతావ్‌ రా
నువ్వెక్కడ పోతావ్‌రా ఇంకెక్కడ పోతావ్‌ రారా
[ఆమె] రా ... రా ...
రారా రాజాకుమార్‌ రా మయాబజార్‌ రా
నీ భాజా భలే రా రా
[అతడు] నీ ఉట్టి నేనే కొట్టి నీ చట్టీ నేనే పట్టి
నీముంతా పాలు వెన్నా అంతా గల్లంతేగా
[ఆమె] నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . . రారా||

చరణం 1

[అతడు] ఓ జగిత చిల్లరగిత్తా సోకులసొత్తా మేనత్తా
మాంతా మన్మధగీత తల్లోరాతా
[ఆమె] ఓ కుర్రోడా బందరు లడ్డా బంగరు గుడ్డా పిల్లోడా
చిక్కిన నా గుర్రపునాడా ఊదేనా గోడ
[అతడు] నీ గుట్టే చెంగల్‌‌పట్టు నీ పట్టే గొంగళ్‌ పట్టు
ఆమ్‌ పట్టు తేనెపట్టు నీ గుట్టు
[ఆమె] వీధి యేటి గట్టు కస్తూరి చుక్కాబొట్టు
దమ్ముంటే కొల్లగొట్టు దణ్ణంపెట్టు
[అతడు] నీ చొక్కా నేనే కట్టా నామస్కా నీకే కొట్టా
ఛీపో చిన్నారి పిట్టా నీతో గుడ్డే పెట్టా
నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . . రారా||

చరణం 2

ఓ రాకాసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తర కాశి వారణాశి
[ఆమె] ఓ రబ్బాయి పీచు మీఠాయి భామల చేయి
చురుకోయి పోవోయి చాలుబడాయి దౌడేతీయి
[అతడు] ఎత్తైన గాసంగంతై ఒంటరిగా టర్కేపగబై
ఆ రెండూ నీలో ఉన్నయ్‌ నువ్వే చెన్నై
[ఆమె] ఇది నీలో గోలజాడ నీకళ్ళకు కమ్మని బాడ
మధురైలో మల్లెలవాన లేనా లేనా
[అతడు] అందాల ఆలుపూరి దిల్లుంటే రావేపోరి
గిల్లేస్తా నీలో చోరి హోరాహోరి
[ఆమె] నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . .రారా||

రామా రామా

పల్లవి

రామా రామా అయ్యోరామా ||2||
[అతడు] అమ్మాయితో మాట్లాడితే; అయ్యోరామా
మీరు అపార్ధాలు తీస్తారు; అయ్యోరామా
హే లేడీతో ఫ్రీగా వుంటే; అయ్యోరామా
మీరు త్రీడీలో చూస్తారు; అయ్యోరామా
ఆడామగా దోస్తీ; మహాపాపమనే లోకం ఇదంట
ఏదో కసివుండి తనే కుళ్లుకునే కాలమిదంట ||అయ్యో|| అమ్మాయి||

చరణం 1

బైకులపైన అలా బయటకి వెళితే
కాకుల కూతలే; అయ్యోరామా
బోరే కొట్టి అలా బీచ్‌కి వెళితే
బాకుల చూపులే; అయ్యోరామా
పుట్టిన రోజు అని పార్టీకెళ్లొస్తే
పుట్టెడు కధలల్లి అయ్యోరామా
పోస్టర్‌ వేస్తరు అయ్యోరామా
చింతలు తీర్చమని సింహాచలమెళితే
శీలం పోయెనని అయ్యోరామా
చాటింపేస్తారు అయ్యోరామా ||అయ్యో|| ||అమ్మాయి||

చరణం 2

కంబైండుగా చదువు సాగిస్తుంటే
కలరే మారులే; అయ్యోరామా
ఆకలిపుట్టి అలా కేకులుతింటే
అల్లరి మాటలే; అయ్యోరామా
చేతులు కలిపేసి షేక్‌హేండ్‌ ఇస్తేనే
లోతుకు వెళతారు అయ్యోరామా
బూతులు వెతికేరు అయ్యోరామా
వీక్లీ ఓసారి ప్రేమే మిస్సయితే
డైలీ పలుమార్లు అయ్యోరామా
ఫీలైపోతారు అయ్యోరామా ||అయ్యో|| అమ్మాయి||

చాంగ్‌ చాంగ్‌

పల్లవి

చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ ||2||
[అతడు] చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే బాపుబొమ్మ కదులుతోంది బాపురే
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే ఊపు చూపి అవుతోంది ఊపిరే
ఆర్టుఫిల్మ్‌లో తలకుచోటు ఇవ్వగా నా హార్టు ఫిల్మ్‌లో తనకు చోటు ఇవ్వగా
నేనౌత్తా కొత్త సత్యజిత్‌రే ||చాంగ్‌||

చరణం 1

[అతడు] ఎంకి పిల్ల కొప్పు యక్షకన్య మెరుపు
ఎలిజిబిత్‌ నునుపు ఎదురులేని రూపు
తేనేపాత్రవే లేక క్లియోపాత్రవేతెల్లవారిని రాత్రివే
గ్రీకు ఇంటివే గిటారు తంత్రివే చూపుసాక మంత్రివే
ఇండియాలో నీకు సాటి వుండరే ||చాంగ్‌||

చరణం 2

[అతడు] మాయలేడి హొయలు మైక్రోసాఫ్ట్ కలలు
ఎంకి కడవ వగలు తేరెక్రాఫ్ట్ లయలు
గుల్షగుంతల బంతిపూల సంతలా కొంగుచుట్టినకోయలా
దేవకాంతుల దమయంతి రీతిలా పూట గత్తిలా వెన్నలా
నిగనిగల నగల నిధికి నువు వోనరే
[ఆమె] చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే హంపి శిల్ప కళలు నాలో హాజరే
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే పాలు సరసులాంటి సొగసుకు ఆన్సరే
క్యాటువాక్‌లు ఫ్యాషన్‌ పరేడ్‌లు యాడ్‌ సంస్థలు
అందాల క్లబ్‌లు నాస్టైల్స్‌నే చేస్తాయి స్పాంసరే

గుసగుసలే గున్నా మామిళ్ళు

పల్లవి

[అతడు] గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో
[ఆమె] చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో
[అతడు] యాయా సౌందర్య ఇది నిజమా యాయా
[ఆమె] అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా
[అతడు] ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా
[ఆమె] హొయ్ చెమటతో చెంగే తాకాలా
హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా ||గుసగుసలే||

చరణం 1

కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో
తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే
ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది
[ఆమె] పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
[అతడు] పదరా పూపొదకే అని సై అన్నట్టే ||2||
[ఆమె] చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు
[అతడు] అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ

చరణం 2

[అతడు] నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది
[ఆమె] మురళివలే స్వరము లీల వాయిస్తూనే
బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు
[అతడు] తగునా ఓ మదనా ఈ తగువంటుంటే ||2||
[ఆమె] తగనా ఓ లలనా ఈ జత కంటాడు ||2||
[అతడు] చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము
[ఆమె] మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం ||గుసగుసలే||

రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా

పల్లవి

[అతడు] రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా - 2
రాధమ్మా పాలేతెలుపన్నా నీళ్ళేనలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపికోపాలా మూగకళ్ళ తేనేదీపాలా
గంగొళి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమషాల
అరెవేడేక్కి ఉన్నది వెన్నెల వాల మేడెక్కి దిగుదురా మేఘమాల ||రామ్మా||

చరణం 1

[అతడు] గోపెమ్మా గువ్వాలే గూడు కాకెమ్మో
[ఆమె] కృష్ణయ్యో పూవ్వే నాదే పూచే నీదయ్యో
[అతడు] దొంగలించుకున్న సొత్తు గోవింద
[ఆమె] ఆవలించ కుంటె నిద్దరౌతుందా
[అతడు] ఉట్టికొట్టే వేళ రైకమ్మో చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
[ఆమె] కృష్ణమురారీ వాయిస్తావో చలికోలాటమేదో ఆడిస్తావో

చరణం 2

[అతడు] ఓలమ్మో చోళిలోన షోకుగోలమ్మో
[ఆమె] ఓయమ్మో కాళిలేక ఈలమ్మో
[అతడు] వేణువంటే వెర్రిగాలి పాటలే
[ఆమె] అది వెన్నదోచుకున్న మిన్ను పాటలే
[అతడు] జట్టేకడితే జంట రావమ్మో పట్టువిడుపు మేలమ్మో
[ఆమె] ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల?
పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా ||రామ్మా||

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది

పల్లవి

[ఆమె] గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది - 2
చిలకమ్మ మనసులోన చిగురంత మెలికఉంది
ఇది ఓహారే రామచిలుక ఎరిక మహామహులకెరుక
నువ్వు మరిలేతగనక నీకా తికమక తెలియవిక
[అతడు] గోదారి గట్టుపైన చిన్నారి చిలకఉందా!
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా?

చరణం 1

[ఆమె] కటింగ్ జీన్స్‌లో మీ ముందుకొస్తే అల్లర్లుఏంటండి?
[అతడు] పొద్దొచ్చేట్టుగ అందాల్ని చూస్తే ఆవేశమొస్తుంది
[ఆమె] ముదుర్ స్టెప్స్‌లో ర్యాగింగ్ జరిపితే మీలీలేంటండీ
[అతడు] క్లాస్ అయ్‌పోయేటట్లుగా కటింగ్‌లిస్తే ఉత్సాహమేస్తుంది
[ఆమె] అంచేతనే మగళ్లని అన్నయ్యలనమంది
[అతడు] ఆప్లేసులో కౌంటు టు కన్నయ్యలనుకోండి
[అతడు] అయితే హరే రామచిలుక కాదది హరే భామచిలుక
నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీపిలక ||గోదారి||

చరణం 2

[ఆమె] సీటీబస్సులో కాపేసుకుంటే కామెంట్స్ ఏంటండీ
[అతడు] చిట్టి పెదవులే కష్టాలు పడితే మాగుండె చెరువౌద్దీ
[ఆమె] ఏదో బుక్స్ తో కాలేజికెళితే మీలుక్స్ ఏంటండీ
[అతడు] చిన్ని స్టెపులే ఎగేసుకొంటే మాకన్ను ఎరుపౌద్దీ
[ఆమె] ట్రాఫిక్‌లో కావాలిలే పార్కింగ్ ఏమిటండీ
[అతడు] కాపాడుతూ ఉంటామని హామీలు అనుకోండీ
అయితే హరేరామచిలుక కాదదరి హరేభామచిలుక
నాకది బలే తెలుసుకనక మెలికది తొలగను ఝూమనకా ||గోదారి||

పసిఫిక్‌లో దూకేయమంటే

పల్లవి

[ఆమె] పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తయినా ఎక్కేస్తానే నీ కోసం ||పసి||
తలకోన జంగిల్‌లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ రోమియోకన్న నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చ గాణ్ణమ్మ ||పసి||

చరణం 1

[అతడు] పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
[ఆమె] కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యార్ మంటాడు
[అతడు] టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
[ఆమె] టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
[అతడు] భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమేకాదా
[ఆమె] తోడువస్తున్నా ప్రేమతోడుకుంటున్నా
[ఆమె] పసిఫిక్‌లో దూకేయమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం

చరణం 2

[అతడు] నీ ఒంపుల కెంపుల్లో ప్రేమపూజ చేస్తున్నా
[ఆమె] నీ గుండెల గాదుల్లో ప్రేమపూవు నవుతున్నా
[అతడు] కరెన్సీ నోటుకన్నా కాస్టుకాదా ప్రేమపాట
[ఆమె] కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
[అతడు] నాలోపాట అర్థంకాదా వద్దకురావే ముద్దుల రాధా
[ఆమె] సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా ||పసి||

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా

పల్లవి

[ఆమె] రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసీగా రమ్మంటు కబురెట్టిందా...
[అతడు] కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనస్సే లాగేసిందా
[అతడు] ప్రియపురుషా వరసా ఇంకా కలిపెయమంటా
[ఆమె] మృదువదనా పతినై పరిపాలించనా
చల్లో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ ||రాధే||

చరణం 1

[ఆమె] నీ కోసమే పుట్టాననీ వూరించకోయ్ వాస్సాయనా
[అతడు] నా కోసమే వచ్చావనీ వాటేయనా వయ్యారమా
[ఆమె] తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
[అతడు] చలిబుగ్గ సిగ్గుతొ మెరవాలంటా
కైగిళ్లజాతరే జరగాలంట
[ఆమె] అరే ఆకలివేస్తే సోకులిస్తా చూపులుతోటి షాకులిస్తా
ఒడిలో సరాసరి పడకేస్తే మామా ||కృష్ణ ముకుందా||

చరణం 2

[అతడు] అంగంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే
[ఆమె] వదిలేసేనే మోమాటమే సాధించావోయ్ సల్లాపమే
[అతడు] రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవలే చేయాలంట
[ఆమె] కసిగువ్వరెక్కలే విప్పిందంటా
నీ కోసమే పక్కలే పరిచిందంటా
[అతడు] అరే మెత్తకువస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సరినే మగసిరిలో దోచేస్తా భామా ||రాధే||

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ

పల్లవి

[అతడు] అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ - 4
అటవి ముల్లంటి పడుచోయమ్మ, మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను, కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క,
జున్ను ముక్క జుర్రుకుపోనా, చక్కని చుక్కా
[ఆమె] అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ, తెగమరిగిన మామ, కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా,
ఒహొ దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

చరణం 1

[అతడు] హే . . . జమాయించూ
[ఆమె] ఓ . . . తమాయించు
[అతడు] పువ్వులబోనాలు, చిరునవ్వుల దాణాలు,
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
[ఆమె] వెన్నెల బాణాలు, నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
[అతడు] హే . . . ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
[ఆమె] యహ్ . . . కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా ||అల్లేల్లే||

చరణం 2

[ఆమె] హే . . . యమాగుంది
[ఆమె] ఈ . . . జమాబందీ
[అతడు] చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా
సంతల బేరాల్లో భీమా సిగ్గులు తూచేస్తా
[ఆమె] చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
[అతడు] హే . . . రేపోమాపో లగ్గా లెట్టి లంగర్‌లేసేస్తా
[ఆమె] అహా . . . ఆటూపోటూ అడ్డేటేని ఒడ్డే చూస్తా ||అల్లేల్లే||

బ్యూటిఫుల్ 2 లవ్ ఈజ్ బూటీఫుల్

పల్లవి

[అతడు] బ్యూటిఫుల్ 2 లవ్ ఈజ్ బూటీఫుల్
ప్రేమంచే మనసుంటే లోకం మెత్తం బ్యూటీఫుల్
నూజివీడులో వలపైనా న్యూజిలాండ్‌లో లవ్వయినా
పోర్ బందరూ ప్యారయినా ఇండోనేషియా ఇస్క్ అయినా
భాషేదైనా ప్రేమల్లోని భావం బహు బ్యూటిఫుల్ ||బ్యూటి||

చరణం

మీ పుట్టిన రోజుకంటే అమ్మాయి నవ్విన రోజే గుర్తుంటే అదిగ్రేటు గ్రేటు గ్రేట్‌లవ్
మీ చదువుల పట్టా కంటే చిన్నది రాసిన చీటి విలువైతే అది స్వీట్‌లవ్ స్వీత్ లవ్ స్వీట్‌లవ్
నువ్వు మెచ్చిన అమ్మాడి తమ్ముడు దేవుడిలా కనిపిస్తే కేపులవ్ ||బ్యూటి||
మీ కిల్లర్ జీన్స్ కన్నా కన్నెది వేసే ఖాదీ ముద్దొస్తే అది బ్యూటీలవ్ బూటీలవ్
మీ గాడ్రేజ్ ఫ్రిజ్‌కన్నా చిన్నది వాడే కూజాకుల్ ఉంటే అది హాట్ లవ్ హాట్ లవ్ హాట్ లవ్
అమ్మాయికి ఎగ్జామ్‌కి ఫీజ్‌ను వెచ్చిస్తే ది కాస్ట్‌లీ లవ్ కాస్ట్‌లీ లవ్ కస్ట్‌లీ లవ్
ఆ పిల్లకి జలుబేరాగా నువు పేషంట్ లాగా అయితే అది హెల్దీ లవ్ హెల్దీలవ్ హెల్దీలవ్ ||బ్యూటి||

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా

పల్లవి

[అతడు] తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా ||2||
[ఆమె] తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా
[అతడు] తుహిమేరా సర్వస్వమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చరణం 1

[అతడు] నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగా
[అతడు] నననా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగా
[ఆమె] కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే
[అతడు] నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా తుహిమేరా ఆ భారమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చరణం 2

[అతడు] నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా చిలిపి పగనువ్వేగా
[అతడు] నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చనక్ నాంచల్ చనక్ నాంచల్ చనక్ నాంచల్ చెలియా

పల్లవి

చనక్ నాంచల్ చనక్ నాంచల్ చనక్ నాంచల్ చెలియా
చమక్ నాంచల్ చనక్ నాంచల్ చనక్ నాంచల్ అబ్బయా
చూపులో కొంటెగా నీ బుగ్గ కొరికి పోనా
చూపులే ఆపగా ఓ చిలిపి మంత్రమెయ్యనా
అందాల తొలి సంధ్యవేళ చల్లగాలల్లే నిన్నంటుకోనా
పరువాలు గిల్లేయకుండా మంచుపరదాని అట్టెట్టుకోనా
నువ్వలా పువ్వలా నాట్యమే చెయ్యగా నడుము తడుముకోనా
నిన్నునే తాకితే చేకితే నేనికా పూల సంకెలెయ్యనా ||చనక్ నాంచల్||
సంధ్యవేళకే చందమామలా కొంగుచాటుగా తొంగిచూడనా
కన్నె పొంగులా గుట్టుదాచగా నీలి మబ్బులే పైటే వెయ్యనా
చెయ్యేస్తే జారకే జవరాలా నిన్నింకా వీడనే మధుబాలా
గిచ్చేసి పోకురా గోపాలా వెచ్చంగా నిలువెల్లా
నువ్వెంత వద్దొద్దు అన్నా వెంట పడతానే ఓ ముద్దుగుమ్మా
నువ్వెంత మొనగాడివైనా నీ చేతులకి నే చిక్కుతానా
నింగిలో దాగినా తారలే సాక్షిగా తాళి నీకు కడతా
నన్నిలా నీడలో జాడలే లాగినా నీకు పడనుకంటా ||చనక్ నాంచల్||
అమ్మదొంగ నీకొంటె అల్లరి సాగనివ్వనే గండుకోయిలా
లేత గుండెపై రక్తహరమై హత్తుకుంటలే అన్ని వేళలా
కవ్వింతలేలరా సోగ్గాడా సై అంటు రాకురా మసకేలా
మువ్వలే మగువే రేయంతా వయ్యారి నెరజానా
అరె ఆ పండి మీ మాట తీరు మాకు ఏ వైపు చుట్టాలు మీరు
వరసైన బావయ్య వీడు ఒక్కముద్దిచ్చి కుందాక పోడు
తోటలో బావయ్యా తొటివే నీవయ్యా దోరపళ్ళ దొంగా
పుస్తులే కట్టి నీ ముగ్గులే జల్లుతా ఎగిరిపడకెమంగా||చనక్ నాంచల్||

జాంపండువే దోర జాంపండువే పూచెండువే మల్లె పూచెండువే

పల్లవి

జాంపండువే దోర జాంపండువే పూచెండువే మల్లె పూచెండువే
నీపాల బుగ్గ ఎర్రమొగ్గలేసే నా మనసున తైతక్క
రవి చూడని రవికని చూసే నా వయసుకి తలతిక్క
జాంపండునీ దోర జాంపండునీ పూచెండువే మల్లె పూచెండునీ

చరణం 1

ఊగింది ఉగింది నా మనసు ఊగింది
నీ కంటి రెప్పల్లో అవిఏం చిటికెలో అవిఏం కిటుకులో
ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది నీ నడుమ
ఒంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెళికలో
ఇది పంచదార చిలక అంచులన్ని కొరక మీదికొచ్చె వాలమాక
ఓయ్ చందనాల చినుక కుందనాల మొలక కోకడాబు కొట్టమాక
నువ్వే నేనుగా తిరిగా జంటగా
నిప్పే లేదుగా రగిలా మంటగా ||జాంపండువే||

చరణం 2

ఒళ్ళంత తుళ్ళింతై చెమటెంత పడుతున్నా
ఆ చెమట చేరనిచోటు చూపించవే అది చూపించవే
కళ్ళంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా
ఆ చెమట చేరనిచోటు ఈ పెదవులే వణికే పెదవులే
నువ్వు ఆడసోకు చూపి ఈడకొంత దాచి కుర్రగుండె కోయమాక
నన్ను కౌగిలింతలాడగ కచ్చికొది త్వరగా కన్నిసైగ కోరమాక
మరి ఏముందిగా చొరవే చేయగా
తరుగేపోదుగా ఒళ్ళో చేరగా ||జాంపండువే||
నా పాలబుగ్గ ఎర్రబుగ్గ లేస్తే నీ మనసున తైతక్క
రవి చూడని రవికని చూస్తే నీ వయసుకి తలతిక్క ||జాంపండువే||

కిన్నెరసాని మన్నెలరాణా నా చెలి

పల్లవి

కిన్నెరసాని మన్నెలరాణా నా చెలి నీవె కదా
నీ సరి లేని సొగసులోసోని మరి మరి కవ్వించకా
వలపెరుగని నాలోనా తొలి సరిగమ నీవేనా
శృతి లయ జత చేసేనా తక తక జను తానానా
సిరి మువ్వై మోగెను నీ ఒడిలో తెల్లానా
||కిన్నెరసాని||

చరణం 1

నీ పలుకే చిలిపి రాగాల రసవీణ
అది వింటే మదిలో తోం తకిట తననా
నీ నవ్వే జిలుగు సిరిమల్లే పువ్వాన ఆ జడిలో నీతో కిట తోం తోం అననా
స్వరమేల వేళలో సుమగంధం వీచుమా
కు కు కు క్కూ కోయిలా కురులల్లో దాచవా
అందాల హిందోల వాత్సాయనా నీముద్దే నాకీర్తనా
||కిన్నెర||

చరణం 2

నా ఎదుటే తగని సిగేల నెరజానా
నీ నడుమే తకతై ధీంతాన దిననా
చనువిస్తే తకిట సరసాలు మొదలేనా
ఈదుడుకే తగునా మార్గంగా మదనా
పరదేశి బాణిలా పరదాలే దాటవా
సన్నాయి పాటలా అదరాలే మీటవా
నీ కన్నె పొంగుల్లో నే చెయ్యనా శృంగార సంకీర్తన
||కిన్నెరసాని||

అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే

పల్లవి

[ఆమె] అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
[అతడు] తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే ||కళ్యాణ గడియే||
[ఆమె] పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా
[అతడు] వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన
[ఆమె] నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
[అతడు] మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే ||2||కళ్యాణ గడియే||


చరణం 1


[అతడు] ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్
కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ ||2||
[ఆమె] నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే
[అతడు] పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే
[ఆమె] నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా ||మీయమ్మ మాయమ్మ||కళ్యాణ గడియే||


చరణం 2


[ఆమె] అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు
అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు||2||
[అతడు] సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం
[ఆమె] నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం
[అతడు] చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె ||మీయమ్మ మాయమ్మ||కళ్యాణ గడియే||