లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే...
పల్లవి
గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా... న్యాయమా...
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా... మౌనమా...
చెలియా నాలో ప్రేమని తెలుపా
ఒక ఘడియ చాలులే
దానిని నేను ఋజువే చేయా నూరేళ్ళు చాలవే ||లేదని|| ||గంధపు||
చరణం 1
హృదయమొక అద్దమనీ నీ రూపు బింబమనీ
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ
అద్దాల ఊయల బింబమూగె చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడీ ఇక వేటాడొద్దే ||లేదని|| ||గంధపు||
చరణం 2
తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేదీ
వాసనలు వీచే నీ కురులు సఖీ..
లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ
సూరీడు మెచ్చే నీ కనులె చెలీ
విశ్వసుందరిమణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే
నా ప్రియసఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగరావే
ఏమి చేయ మందువే...
Showing posts with label - టబు. Show all posts
Showing posts with label - టబు. Show all posts
Subscribe to:
Posts (Atom)