Showing posts with label - కార్తిక్. Show all posts
Showing posts with label - కార్తిక్. Show all posts

మాటే మంత్రము...

మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ ||మాటే||
ఓ ఓ మాటే మంత్రము...
మనసే బంధము

చరణం 1

నీవే నాలో స్పందించిన
ఈ ప్రియలయలో శ్రుతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా... పూవు తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో ||మాటే||
ఓ ఓ ||మాటే||

చరణం 2

నేనే నీవై ప్రేమించిన
ఈ అనురాగం పలికించే పల్లవిదే
ఎదనా కోవెల... ఎదుటే దేవత
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో ||మాటే||

కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే

సా... నిసరీసాని... సా నిసమగామరి
పదసా... నిసరీసాని...
సా... నిసమగామరి
పదసససని రిరిరిన గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని...
కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురసవాణి... కీరవాణి... ||చిలకల||

చరణం 1

గరిస పమగ పాని సరిగ రిగస నీద...
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే...
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే... కీరవాణి
చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన
మంజులవాణి ||కీరవాణి||

చరణం 2

నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే ||కీరవాణి||

సాగర సంగమమే...

సాగర సంగమమే..
ప్రణయ సాగర సంగమమే ||2||
కలలే అలలై ఎగిసిన కడలికి ||2||
కలలో... ఇలలో...
కలలో ఇలలో దొరకని కలయిక ||సాగర||

చరణం 1

కన్యాకుమారి నీ పదములు నేనే ఆ...
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా...
అలిగిన నా కొల అలకలూ నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా... ||సాగర||

చరణం 2

భారత భారతి పద సన్నిధిలో...
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళా...
పరువపు ఉరవడి పరువిడి నీ బడి
కన్నుల నీరిడి కలిసిన మనుసున
సందెలు కుంకుమ చిందిన వేళా... ||సాగర||

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో ||అలలు||

వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు
మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు
ఘడియే యుగమై బతుకే సగమై
గడిచేనిన్నాళ్ళు
వలపే వగపై తానే వరదే కురిసే కన్నీళ్ళు
కురిసే కన్నీళ్ళు...

చరణం:1

సా గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమపా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మ్మ గాగ సాస నీసా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో
తనన ననన ననన ననన తనన ననన నాన ||అలలు||

చరణం:2

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ...
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరుచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడిబొమ్మా...
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే ||అలలు||

రంగులలో కలవో

పల్లవి

రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో
నవ శిల్పానివో
రతి రూపానివో
తొలి వూహల వూయలవో...

చరణం 1

కాశ్మీర నందన సుందరిలో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో
మరుని బాణమో మధుమాస గానమో
నవపరిమళాల పారిజాత సుమమో

చరణం 2

రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై
రతి రూపాంగినై
నిను వూహల వూగించనా

చరణం 3

ముంతాజు అందాల అద్దానివో
కషాబాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో నా విరహతాపమో
నా చిత్రకళా చిత్ర చైత్రరధమో! ||రంగు||

అదే నీవు అదే నేను

పల్లవి

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా
కనులలో చూడనా

చరణం 1

కొండా కోన గుండెల్లో
ఎండా వానలైనాము
గువ్వాగువ్వ కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము ||అదే||

చరణం 2

నిన్నా రేపు సందెల్లో
నేడై వుందా మన్నావు
కన్నీరైన ప్రేమలో
పన్నీరౌదా మన్నావు
అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్లీ నిన్న పాటే పాడను ||అదే||

ఎదుటా నీవే ఎదలోనా నీవే

పల్లవి

ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటుచూస్తే అటు నీవే మరుగైనా కావే

చరణం 1

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
గాయాన్నైనా మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణి కానీదు
||ఎదుట||

చరణం 2

కలలకు భయపడిపోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకంత బలముందా
||ఎదుట||

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

పల్లవి

చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి
ఇద్ద రొద్దికైనారు
ముద్దు ముద్దుగున్నారు
||చుక్క||

చరణం 1

ఈ పిల్లకు మనసైంది
ఆ కళ్ళకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది
ఈ బుగ్గకు సిగ్గైంది
కళ్యాణం వైభోగం
నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు తాళాలు బాణాసంచా కలలే కన్నారు
||చుక్క||

చరణం 2

పెళ్ళికి మాకేమిస్తారు?
కొత్త బట్టలు కుట్టిస్తారు
గుర్రం సార్టు ఎక్కిస్తారు
ఊరంతా ఊరేగిస్తారు
||చుక్క||

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు

పల్లవి

ప్రేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీరసాగర మథనం
మింగినాను హాలాహలం
ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
||ప్రేమ||

నే నోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చికటిలో కలిసేపోయి
నా రేపటినే మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
అపు డాగాలి ఈ మూగగానము
||ప్రేమ||

ప్రేమలేదని ప్రేమించరాదని

పల్లవి

ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా! జోహారులు!

చరణం 1

మనసు మాసిపోతే మనిషి కాదనీ
కటిక రాయికైనా కన్నీరుందనీ
వలపుచిచ్చు రగులుకుంటే ఆరిపోదనీ
గడియపడిన మనసు తలపుతట్టి చెప్పనీ
ముసురుగప్పి మూగవోయి నీ వుంటివి
||ప్రేమ||

చరణం 2

గురుతు చెరిపివేసి జీవించాలనీ
చెరప లేకపోతే మరణించాలనీ
తెలిసి కూడ చేయలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూచి రోదించనీ
||ప్రేమ||