Showing posts with label - అల్లరి నరేష్. Show all posts
Showing posts with label - అల్లరి నరేష్. Show all posts

ఎంతవరకూ.. ఎందుకొరకు.. ఇంత పరుగూ అని అడక్కూ..

ఎంతవరకూ.. ఎందుకొరకు.. ఇంత పరుగూ అని అడక్కూ..
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకూ..
ప్రశ్నలోనే బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగూ..
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా..
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా.. ||ఎంతవరకూ||

చరణం 1

కనపడే ఎన్నెన్ని కెరటాలూ.. కలగలిపి సముద్రం అంటారు..
అడగరే ఒకొక్క అల పేరూ ఊ ఊ..
మనకిలా ఎదురైన ప్రతివారు.. మనిషనే సంద్రాన కెరటాలు..
పలకరే మనిషి అంటె ఎవరూ ఊ ఊ..
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా వున్నది..
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది..
నీ వూపిరిలో లేదా.. గాలి వెలుతురు
నీ చూపుల్లో లేదా.. మన్ను మిన్ను
నీరు అన్నీ కలిపితె నువ్వే కాదా.. కాదా.. ||ప్రపంచం||

చరణం 2

మనసులో నీవైన భావాలే.. బయట కనిపిస్తాయి దృశ్యాలే..
నీడలూ నిజాల సాక్ష్యాలే.. ఈ.. ఈ..
శత్రువులు నీలోని లోపాలే.. స్నేహితులు నీకున్న ఇష్టాలే..
ఋతువులు నీ భావ చిత్రాలే.. ఈ.. ఈ
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం..
మోసం రోషం ద్వేషం నీ మకిలీ మదికీ భాష్యం..
పుటక చావూ రెండే రెండు.. నీకవి సొంతం కావు.. పోనీ..
జీవితకాలం నీదే నేస్తం.. రంగులు ఏం వేస్తావో కానీ..
తారరరరె తారరరరె తరరరరె తారరరె.. తారరరరె తారరరరె తరరెరా తారరరె.. తారరరరె తారరరరె తరరెరా తారరరరె

ఫిదా ఫిదా ఫిదా ఫిదా

పల్లవి

[అతడు] ఫిదా ఫిదా ఫిదా ఫిదా హొగయా చెలియా
అధా అధా అధా అధా చాగయా సఖీయా
జరా జరా జరా ఫాస్‌ ఆ గుడియా
మెరా మెరా మెరా ప్యార్‌ హే బడియా ||ఫిదాఫిదా||
ఉలికే రోజా ఒడికే ఆజా ఒకసారి రాలుగాయి పిల్లదిరా
[ఆమె] హాయిరే తాజా చేసేయ్‌ పూజ మధుఘోషి సోకెరాసై రాజా
[అతడు] ఏయ్‌ అచ్చమైన విరి గుచ్చె చేపెగురె వెచ్చనైన సిరి వచ్చిచేరిదరి
ఎక్‌బార్‌ జరసున్‌నె బాతుగురియా ||ఫిదాఫిదా||

చరణం 1

[అతడు] ఆరేటి కోక తాకేగోరి చేదారిపోకే ఆరితేరీ
[ఆమె] ఈలేసి ఈడే వాడీ వాడీ వాటేసిపోరా హొరా హొరీ
[అతడు] హల్‌హల్‌ చలే కలిమిలా చూడూ చల్‌ చల్‌ చలీ కరే మజానేడు
[ఆమె] విన్నపాలు విని చెంత చేరుకోవా ఈ కన్నె సోకులతో కన్నేగీటుకోరా
[అతడు] ఏయ ఉన్నపాటుమరి యవ్వనా ఆవిరి చుట్టుగేసి గిరి
సద్దుకుందిదరి హత్తికోన మరి ఓన్స్ మోరఫడియా ||ఫిధాఫిధా||

చరణం 2

[ఆమె] ఆరాటవీరా చూపే దాటి వాటేసి నీకు నీవే సాటి
[అతడు] వేవేడి చూసా నీలో వాడి ఓసారి ఆడే నాతో కూడి
[ఆమె] పోగొకీల కీలకే పదానేడు మన్నంచల చలోజతే ఆడు
[అతడు] వన్నె దాని సిరి వంతపాడినది ఓడ ఉన్నపాటుమిది చిందిలేసినది ఓఓ
[ఆమె] టెక్స్‌సెత్‌మెర ముచ్చటైన దోర వేట సెయ్‌ర దోర పట్టుసోకు జర
ఆపు జోరుదోర మళ్లీ ప్యాస్ పరదా ఆ ఆ ఆ ||ఫిదాఫిదా||

ఇంత అందమైన అమ్మాయిని

పల్లవి

[అతడు] ఇంత అందమైన అమ్మాయిని ||2|| దేవుడా
ఎట్ట తలచినావో మలచినావో దేవుడా
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
నేను ఇంతకాలం చూడలేదు దేవుడా
ఐస్‌కాంతమేదో తన చూపుల్లో దాగుంది తనవైపే లాగేస్తు ఉంది
నా మనసే ఆగదు ఏబాషైన చాలదు తనరూపం వర్ణిస్తూ ఉంటే
హరివిల్లుని బొమ్మగ చేసి అణువణువు వెన్నెలపోసి
నాకోసం పుట్టించావే మో ||ఇంత అందమైన||

చరణం 1

[అతడు] తన సన్నగా నవ్వితే ముత్యాలవాన ఆవానలో తడవాలేమైనా
నడువోంపులో ఉన్నది వయ్యారవీణ ఆ వీణలో రాగాన్నయిపోనా
అమ్మాయి ఊరేంటో తన ముద్దు పేరేంటో తన ఇష్టాలేంటేంటో
చెలిమే తలచి పనులే విడిచి రేయిపగలు తన ఊహలతో
ఇది వరకెరుగని అలజడి మొదలై తడవ తడబడి పోరబడి
కలవరపడుతు కలలే కంటు కునుకే రాదు కుదురేలేరు
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ||ఇంత అందమైన||

చరణం 2

[అతడు] తను అడిగితే ఇవ్వనా నా ప్రాణమైనా నా సర్వము తనదే అంటున్నా
కనుపాపని కాపాడే కనురెప్పలాగ చెలితోడుగా నూరేళ్ళంటాగా
ఆ దేవుడు వరమిచ్చి తన మనసే నాకిస్తే నాకింకేం కావాలి
ఎప్పుడూ లేదే ఎదలో గుబులు నిను చూసాకా సిగలేమొదలు
కదలడు సమయం క్షణమొక యుగమై కనులు తెరవగ
ఎదురుగ నిలబడి చేతులు చాచి రమ్మని పిలిచి అంది అందక
ఊరిస్తావే ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ||ఇంత అందమైన||

ఇచ్చోటనే ఇచ్చోటనే నీ అన్న

పల్లవి

[ఆమె] ఇచ్చోటనే ఇచ్చోటనే నీ అన్న చెన్నకేశవరెడ్డి గొడ్డలిచేత బట్టింది
ఇచ్చోటనే ఇచ్చోటనే నీ తంబి ఆదికేశవరెడ్డి అదరగొట్టి తోడగొట్టింది
ఇచ్చోటనే ఇచ్చోటనే
సింహం నువ్వు సమరసింహం నువ్వు
నలుదిక్కుల ఈ సీమకు దిక్కే నువ్వు
చుక్కే నువ్వు మెరుపు ముక్కే నువ్వు
కత్తెలలో అదిరిపోవు ముద్దరనీవు
ఏయ్‌సై అంటే ఎవడైనా చెరిసెగమె ఆపైన రంగంలో వీరంగమే
[అతడు] వేట కోడలిలతో బోట్టుకోస్తే పుట్టాపిల్లో వేడి నెత్తురులో ఓనమాలు దిద్దా బల్లో ||2||
[ఆమె] రెడ్డిరెడ్డిరెడ్డిరెడ్డి సమరసింహరెడ్డి ఈ వాడివేడి మీద ఆడుకొలా కబాడ్డీ
[అతడు] రెడ్డి రెడ్డి రెడ్డి రెడ్డి ఇంద్రసేనారెడ్డి
దున్నకోర దుమ్మురేడి యమ్మ యమడి ||ఇచ్చోటనే ఇచ్చోటనే||

చరణం 1

[అతడు] ఒక్కమగాడ్ని ఒక్క మగాడ్ని ఎవడి మాట వినని తోడగొట్టే మగాడ్ని
[ఆమె] సొరఎత్తులు నీవే చురకత్తులు నీవే దడపుట్టె పడగొట్టే దమ్ముని నీవే
[అతడు] పందెంలో పంతం నాదే వెంటపడి వేటాడే పంజానాదే
[ఆమె] నువు అడుగేస్తే పిడుగు పడతది గొల్లుమని బ్రహ్మండం బద్దలవుతది
రెడ్డి రెడ్డి రెడ్డి ఆదికేశవరెడ్డి ఇంతకైన ఎంతకైన రవ్వుదిబాడీ
రెడ్డిరెడ్డిరెడ్డిరెడ్డి చెన్నకేశవరెడ్డి సింగమలై సింహమల్లె చెయ్యరాదాడి
వాదెంత మగడబ్బో మాసంటే మాస్‌ మగాడబ్బా ఓలమ్మ ఓలమ్మ
ఎంత మగడబ్బా క్లాసంటీ కుర్రాడబ్బా ఓలబ్బ ఓలమ్మ ||ఒక్క మగాడ్ని||

చరణం 2

[అతడు] మిసమున్నాదే రోషమున్నాదే పౌరుషం పొలిమేర దాటిఉన్నాదే
[ఆమె] ఉక్కేనీవు ఉప్పెన నీవు ఎరుపెక్కిన ఎవడికైన కాలంచెల్లె
[అతడు] ఫ్యాషనకే నే బాసునే అమ్మతోడు అడ్డంగ నరికేస్తానే
[ఆమె] యాక్షన్‌కే కింగ్‌ నువురా అరె నాటుబాంబు నరాలతో చుట్టిసారా ||రెడ్డి రెడ్డి రెడ్డి||

మనసా వాచా కర్మణా

పల్లవి

[అతడు] మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
[ఆమె] కర్త కర్మ క్రియ నాకు నువ్వేనంట
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
[అతడు] కదిలే వెన్నెల శిల్పం నీవని కన్నుల కోలువుంచా
కురిసే మల్లెల జడిలో ప్రేయసి నువ్వేనని తలిచా
[ఆమె] మధునుడు పంపిన వరుడే నువ్వని
మనవే పంపిచా నా మనసే అర్పించా ||మనసా వాచా||

చరణం 1

[అతడు] దిక్కులు నాలుగు అని అందరు అంటున్న
కాదు ఒకటేనని నిన్నే చూపిస్తా
[ఆమె] ప్రాణాలు ఐదు అని ఎందరు చెపుతున్న
ఒకటే ప్రాణమని మననే చూపిస్తా
[అతడు] ఎన్నడు ఓడని ప్రేమకు ఋతువులు ఆరే కాదమ్మ
[ఆమె] జంటగ సాగుతు పెళ్ళికి నేడే అడుగులువేద్దామా
[అతడు] ఇష్టైశ్వర్యం మనకందించె వరమే
ఈ ప్రేమ ప్రేమకు మనమే చిరునామా ||మనసావాచా||

చరణం 2

[అతడు] కన్నులు ఉన్నవిలా నిను చూసేటందుకులే
నాకంటికి వెలుతురిలా నువ్వుంటే చాల్లే
[ఆమె] పెదవులు ఉన్నవిలా నినుపిలిచేటందుకులే
ఆపిలిచే పేరొకటే నీదైతే చాల్లే
[అతడు] పాదం ఉన్నది కడవరకు నీతో నడిచేందుకులే
[ఆమె] అందం ఉన్నది నీ కౌగిట్లో అలసేటందుకులే
[అతడు] హృదయం ఉన్నది నిన్నే తనలో దాచేటందుకులే
[ఆమె] అది ఒక సొంతం నాకే ||మనసా వాచా||

మంచమేసి దుప్పటేసి

పల్లవి

[ఆమె] మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రా రా రా రా
[అతడు] చిన్ని చీర కట్టాను సన్నజాజులెట్టాను రా రా రా రా
దిండు ఎంతమెత్తనా మంచమెంత గట్టిదో
చుక్కలోంక చూసుకుంటు లెక్కపెట్టుకుందాము రావే
[అతడు] ఆకలేసి దప్పికేసి అందమంటు వచ్చాను రావే రాక
ఆకులోన సున్నమేసి ఒకచెక్కలిస్తాను రావే రావే
పండు ఎంత తియ్యనో పాలు ఎంత చిక్కనో
సోకలోంక చూసుకుంటు సొమ్మసిల్లి పోదాము రావే

చరణం 1

[అతడు] నిన్ను చూడకుంటె నాకు పిచ్చిగుంటది
నిన్ను చూస్తె వయసు నన్ను మెచ్చుగుంటది
[ఆమె] కౌగిలంత కోరలేత అలసిపోతివి
రాతిరంత కునుకులేక రగిలిపోతది
[అతడు] అయ్యో కసికసి ఈడు కమ్ములేస్తే
[ఆమె] కంటిని రెప్పై కాటువేస్తా
[అతడు] ఎట్టా ఆగను చలిలో గిలిలో
[ఆమె] ఎట్టు అడగను అసలేకోసరు చాలాలే నీజోరు ||ఆకలేసి||

చరణం 2

[ఆమె] రగులుతున్న సోకుమీద మిగడున్నది
పెదవిదాటి ముద్దులాగ మారుతున్నది
[అతడు] చీకటింట చిట్టిగువ్వే రొప్పుతున్నది
వాలుకంట వలపుమంట అంటుకున్నది
[ఆమె] జల్లోపువ్వు జావలి పాడే
[అతడు] ఇల్లు ఒళ్ళు వంతిడిసావే
[ఆమె] ఎంత తీరిన ఎదలో సోదలే
[అతడు] వింత వింతగా జరిగే కధలే మోగాలి గొలితాళం ||మంచమేసి||