Showing posts with label - తరుణ్. Show all posts
Showing posts with label - తరుణ్. Show all posts

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
కలత పడుతుందే లో లో న కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగిలు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
పచ్చగా ఉన్న పూతోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ||పచ్చగా||
ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా ||2||
తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకు పోడం తక్షణం
అంటూ పట్టుపడుతుందీ ఆరాటం పదమంటూ నెట్టుకెలుతుందీ నను సైతం

మనసున వున్నదీ చెప్పాలనున్నదీ...

మనసున వున్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావేఁ ఎలా
మాటున వున్నదీ ఓ మంచి సంగతీ బయటకు రాదేఁ ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో తెలుపకపోతే ఎలా..
లలలా లల లల లలలలలాలాలా ||మనసున||

చరణం 1

చింత నిప్పల్లె తీయంగ వుందని
ఎంత నొప్పైన తెలియలేదనీ
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేక గుండెల్లో కొండంత బరువనీ
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందనీ
తెలుపకపోతే ఎలా.. ||మనసున||

చరణం 2

నీలికన్నుల్లో ఆతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందనీ
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైననీకు
ఆశలరాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపకపోతే ఎలా.. ||లలలా|| |మనసున||

నిద్దురపోతున్న రాతిరినడిగా...

చెలియా నీవైపే వస్తున్నా...
కంటపడవా ఇకనైనా... ఎక్కడున్నా..

పల్లవి

నిద్దురపోతున్న రాతిరినడిగా...
గూటికిచేరిన గువ్వలనడిగా...
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలిజాడ చెప్పరేమనీ...
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ||చల్లగాలి||

చరణం 1

ఓ... అసలే ఒంటరితనం.. అటుపై నిరీక్షణం..
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం...
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ
నిజం చెప్పవమ్మా ||అందరినీ|| ||నిద్దురపోతున్న||

చరణం 2

ఓ... నువ్వు నా ప్రాణం అని.. విన్ననించు ఈ పాటని..
నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నాగానీ...
కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే ||అందరినీ|| ||నిద్దరపోతున్న||

అయామ్‌ వెరీ సారీ అన్నాగా ముందోసారి

అయామ్‌ వెరీ సారీ అన్నాగా ముందోసారి
సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి ||2||
హయో హయో హయో
పెదాలలా బిగించి శపించకే మరీ
మంత్రాలవీ జపించి వదిలెయ్‌ క్షమించి
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్‌ చేపా
ఫారెక్స్‌ బేబీ టైపా లౌలీ లాలి పాపా ||అయామ్‌||

చరణం 1

తరిమి తరిమి తరిమి
నిను ఏడిపించడంఎందుకా అని
అడిగావనుకో చెబుతా వింటావా మరి ||తరిమి||
సమ్మర్‌ గిమ్మర్‌ వింటర్‌ అంటూ
ప్రతీ రుతువుకో డిఫరెన్సూ
ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ
మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అది తీర్చుకుందుకే
తమషాగా ట్రైలేసి చూశానే బేబీ
అయామ్‌ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి ||2||

చరణం 2

లిప్‌స్టిక్‌ అవసరమైనా
లేనంతా ఎర్రగా పెదవి ఉండిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే ||లిప్‌స్టిక్‌||
టమాటొ పళ్ళకి డూపుల్లా
సుమారు సిమ్లా యాపిల్లా
ఉన్నావె పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే
బుగ్గలు బర్గర్లా
నన్నుండనీయకూరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అది
అయామ్‌ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి ||2‌||

నా మనసుకేమయింది నీ మాయలో పడింది

నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా... తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా... లోలోపల
మన ఇద్దరికీ తెలియంది
ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా మది ఉలికి పడుతువుంది ||నా మనసుకే||

చరణం 1

చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందదా
నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో
చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని ||నా మనసుకే||

చరణం 2

ఎప్పుడూ గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ
కళ్లలో ఉన్న నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవ్వరు
కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కధని ||నా మనసుకే||

కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు

పల్లవి

కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండెకోత కోచుటెందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళకు తెలుసు
నువ్వు నేనూ ఇద్దరు ఉన్నమంటే
నమ్మనంటు ఉంది మనసూ ఓ...ఓ...ఓ...

చరణం 1

ఈనాడే సరికొత్తగా మెదలైందా మలిజీవితం
గతమంతా ఏంలేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకొని ఏంలాభం
కలై పోదుగా ప్రయాణం
ప్రతి క్షణం ఎదురైయ్యే నన్నే దాటగలడా ||కళ్ళ||

చరణం 2

గాలి పటం గగనానిదా ఎగరేసి ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
నిన్ను మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ
తడి దాచుకున్న మేఘంలా ఆకాశాన్న నువు ఎటువున్నా
చినుకులో కరగక
శిలై ఉన్న ఉండగలవా ||కళ్ళ||

ఒలె ఒలె ఒలె ఓలా ఓలా

పల్లవి

[ఆమె]ఒలె ఒలె ఒలె ఓలా ఓలా
గిలి గిలి గిలిగా ఉంది ఈ వేళ - 2
నిలబడు నేనన్నది పైట నిదరన్నది లేదే పూట
ఏడ ఉన్నాడే ఏడ ఉన్నాడే ఏడ ఉన్నాడే కిలాడి ఏడ ఉన్నాడే
జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే
కిలాడీ జారుకున్నాడే ||ఒలే||

చరణం 1

ఇంకా చెలియ ఏది ఏది చేసాడే
[ఆమె] కలలో వచ్చి కౌగిలించు కున్నాడే
ఆ పై చిలకా ఏమి చేసి పోయాడే
[ఆమె] చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే
కితకితలెడుతున్నాయన్నా వినుకోడే లవ్‌యు గిల్లేసాడే
 ఏడ గిల్లాడే పిల్లా ఏడ గిల్లాడే
[ఆమె] కొంటె కుర్రాడే లేత బుగ్గ గిల్లాడే ||ఒలె||

చరణం 2

[ఆమె] గడయా వేస్తే తొంగి తొంగి చూసాడే
వారే పిల్లా అపప్పుడేమి చేసాడే
[ఆమె] నేను వస్తా తలుపు తియ్య మన్నాడే
అమ్మో దొంగా చూసి ఏమిచేసాడే
[ఆమె] పొగరెక్కిన పిల్లాడే పగబట్టి ఉన్నాడే, సరసానికి వద్దన్నా
సొద వినడే, లవ్‌లీ అంటూ పడిపోయాడే
ఏడ పడ్డాడే పిల్లా ఏడ పడ్డాడే
[ఆమె] గోడమీదెక్కి కాలుజారి పడ్డాడే ||ఒలె||

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది...

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ.. ఇదేం అల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే.. ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా..
పేరు కైనా నేను లేనా..
దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. ||ఎక్కడ ఉన్నా||

చరణం 1

నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఎమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా...
ఓ... ||దీని పేరేనా|| ||ఎక్కడ ఉన్నా||

చరణం 2

కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ
మనసు మునుపు ఎపుడూ ఇంత
ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింతా
ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
ఓ... ||దీని పేరేనా|| ||ఎక్కడ ఉన్నా||

అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే నీతుల చిఠ్ఠాలన్నిట్నించి యువాంట్ ఫ్రీడం

పల్లవి

[అతడు]అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే నీతుల చిఠ్ఠాలన్నిట్నించి యువాంట్ ఫ్రీడం
[ఆమె] ఎంచక్కా ఇక్కట్ల నుండి అర్థంలేని సిలబస్ నుంచి యువాంట్ ఫ్రీడం
[అతడు] పిడుగే పడినా అదరం పనిలో పడితే వదలం భ్రమలో పడుతు బ్రతుకు యులవ్ లైక
[ఆమె] మనసా ఎగిరే భ్రమరం, వయసా విరిసే సమరం మనదే మనదే లోకం ఓనేస్త్‌మ్...

చరణం 1

[అతడు] డబ్బు జబ్బుతో ముదిరిపోయిన పాలిటిక్స్ మాకొద్దు
సృష్టి అంతకి తియ్యనైనది చెలిమే ముద్దు
చదివి చచ్చిన జాబులివ్వని ఇన్‌స్టిట్యూట్ మాకొద్దు
పాసైన ఫైలైనా ఒకటేరా నేస్తం
పెళ్ళైతే అత్తారే ఇస్తారోయ్ జీతం

చరణం 2

[ఆమె] పూట పూటకు డ్రస్సులు మార్చే స్టైల్ పాపలం మేము
రోజు రోజుకు ... చేసే క్రేజీ ఇస్తాము
[అతడు] హొరు గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అనము
[ఆమె] రైటైనా రాంగైనా మా మాటే వేదం
చిరునవ్వే ఆభరణం, స్నేహం మా నైజం
[అతడు] నీడలాంటిదే స్నేహం బ్రదరూ నిన్ను విడిచితనుపోదూ
వయసు వీడినా శ్వాస ఆగినా మనసొదిలి పోలేదూ ||అమ్మ||

అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా

పల్లవి

[అమె]అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
[అతడు] అరె చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియా షుక్రియా
సోడాలకు ముఖ్యం గోళి, పెళ్ళాలికి ముఖ్యం తాళి ఉండాలోయ్
పెన్నుకు పాళి షుక్రియా, షుక్రియా ||అరె||

చరణం 1

[ఆమె] హైటెక్కు సర్కారొస్తే నాయుడు బావకి షుక్రియా
[అతడు] బియ్యం ధర పెరిగిందండోయ్ బిజెపికి బోలో షుక్రియా
[ఆమె] ఎగ్జామ్స్ కి చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియా
[అతడు] కాన్వెంట్‌లో ఎల్‌కేజి లక్షలు అడిగితే బోలో షుక్రియా
[ఆమె] వంటింట్లో గ్యాస్ అయ్యిపోతే కుంపటి తల్లికి షుక్రియా
[అతడు] కాసుల కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఓడే గనులకు షుక్రియా
చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియా
[ఆమె] . . .

చరణం 2

[అతడు] గర్ల్‌ఫ్రెండును కలిసేటప్పుడు వాళ్ళన్నయ్య వస్తే షుక్రియా
పెళ్ళాము అనుకొని మరదలి చెయ్యెట్టస్తే బోలో షుక్రియా
ఏజైన యాక్టర్లందరు ఎమ్.పి. లైతే షుక్రియా
పెళ్ళాలని గద్దెక్కించే చాలూ గాళ్ళకి బోలో షుక్రియా
పట్టాలకి డైవర్స్ ఇచ్చే రైళ్ళకు బోలో షుక్రియా
[ఆమె] బస్సుల్ని పడవలు చేసి ఆర్టిసి కి షుక్రియా
[అతడు] నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియా
[ఆమె] తొలివారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియా ||అరె||

అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘంవుంది

పల్లవి

[అతడు]అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘంవుంది
మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకైయింది, చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకే నేల చిలకలు వాలే చెట్టైయ్యింది
నా చిలుక నువ్వే కావాలి, నా రాచిలుక నవ్వే కావాలి
రాగాల పువ్వే రావాలి, అనురాగాల మువ్వై మ్రోగాలి ||అనగా||

చరణం1

[అతడు] ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాళి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా. . .
కవ్వించగా ఆ. . .ఆ. . .ఆ. . .అ. . .
[ఆమె] ఆ. . .నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీ కేసి ||ఇద్దరు||
నువ్ చెవిలో చెప్పిన ఊసులకోసం నే వచ్చాసా పరుగులు తీసి ||నా చిలుక|| ||అనగ||

చరణం2

[అతడు] చుక్కలలోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నాకోసం
వేచి సాహసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించంగా
[ఇద్దరు] ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూంటే ||నా చిలుక|| ||అనగ|| 

చక్కరంటి చూపులవాడె చక్కనైన నవ్వులవాడె చుక్కలన్ని దాటుకు వచ్చాడే

పల్లవి

చక్కరంటి చూపులవాడె చక్కనైన నవ్వులవాడె చుక్కలన్ని దాటుకు వచ్చాడే
నచ్చాడే పాలబుగ్గోడే ఇరికిచ్చాడే లేత చెలికాడే
పట్టువంటి ఒంపుల రాణె పిట్టనడుము సొంపుల జానె
ముట్టుకుంటె సిగ్గుల దొరసానే
నచ్చిందే నీటి కిల్లాడి జత కొచ్చిందే ముద్దుకు అల్లాడి
సుతారంగ కన్నేలేడి విలాసంగ
మీసం దువ్వి వయ్యారంగరా అన్నాడే
నచ్చిడే సోకు చిన్నోడే మనసిచ్చాడే కోరుకున్నోడే

చరణం 1

అలాగుచ్చినన్నే చూసి వలేబ్రిడ్జి ఎక్కించేసి ఇలా వచ్చిఒళ్ళో వాలిందే
నచ్చిందే రామచిలకమ్మా మది ముంచోద్ధే ప్రేమ చినుకుమ్మా
గులాబంటి అంధం చూసి బళా అంటూ
పందెం వేసి మతా బంటి మనసే దోచాడే
నచ్చాడే పైడి బుల్లోడే ఎరుపెక్కేలా బుగ్గగిల్లాడే
లెగుస్తూనె లేడై ఉరికె పిలుస్తూనె ఈడై దొరికే
నడుస్తూనే నడుమే చిక్కిందే హొయ్....
నచ్చిందే రాస గుమ్మాడీ నువు ఊరించే ఆశ అమ్మాడీ
నచ్చాడే కొంటె పిల్లోడే గుడిగుంచాల విందు కొచ్చాడే

చరణం 2

ఇటే పేసి రాకంటున్నా గిరెగిసి కాదంటున్నా గురేచూసి కళ్ళోకొచ్చాడే
నచ్చాడే నీటుకుర్రోడే నులివెచ్చంగా ముద్దులిచ్చాడే హా......
అదె గోల ఇంట్లోవున్న ఎదే గోల పెట్టే వేళ
ఎలా గోల వచ్చేస్తుందమ్మో
నచ్చిందే కన్నె గులకమ్మో నడిరేయల్లా తేనె మరకమ్మో
తగులుతూనె సెగలైపోయి రగులుతోనె పగలురెయి మొగలిపూల కౌగిలి ఇచ్చాడే
నచ్చాడే కోడి గిలిగాడే నిను మెచ్చాడే పూలి గిజిగాడే
నచ్చిందే హాయి నడకమ్మో ఇక తిరగేస్తే బావి గిలకమ్మో ||చక్కరంటి||

నోటిలోన వేలి పెడితె కొరకలేనివాడు వీడు నావాడు

పల్లవి

నోటిలోన వేలి పెడితె కొరకలేనివాడు వీడు నావాడు
తోటకూరకి పాలకూరకి తేడా తెలియనివాడు వీడునావాడు
ఆల్ ఆంధ్రా అమాయకులకి అధ్యక్షుడు మావాడు
అనుకున్నా నిన్నటి వరకే కాదంటూ కధనడిపాడు ||నోటిలోన||

చరణం 1

ఎలాగ ముందుకు వెళ్ళాడు ఎలాగ మొదలెట్టాడు
ఇలాంటి ముద్దుల గుమ్మడిని ఎలా ముంచినాడు
ఎలాంటి సైగలు చేసిందో ఎలాంటి వల వేసిందో
ఈమె ఇలాంటి తుంటరి పనులన్నీ ఎలా తెలుసుకుందో
మన్మధుడే మఫ్తీలో వచ్చాడే మాస్టారై పాఠాలే చెప్పాడు
పట్టుతప్పి అడ్డంగా ప్రేమల్లో పడ్డాడు
చుట్టుపక్క అందర్ని పిచ్చోల్నే చేశాడు ||నోటిలోన||

చరణం 2

ఇవాళ పిలిచే పిలుపులకి ఎళ్ళుండి ఊ అంటాడు
వీడు ఇవాళ చెప్పే జోకులకి రేపు నవ్వుతాడు
నిదానమన్న పదానికి ముస్తాబు చేస్తె ఈమె
మోమాట మనం భావనకి మనిషి రూపు ఈమె
ఇద్దరికీ ఎట్టా కుదిరిందో ఈపైన ఇంకేకానుందో
షష్ఠిపూర్తి వరకైనా శోభనమే చేస్తారు
పిల్లలెప్పుడు పుడతారో వాల్లెట్టా ఉంటారో ||నోటిలోన||

రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం

పల్లవి

రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనె ఇక పయనం
కలరాని ఆరిజారిపోయె కంటి రెపరెపలో
శిలమీద రాలిపాలిపోయె పూలగుమగుమలో||రాదుకదా||

చరణం 1

ఈ జగమే మనమై ఒదిగేలా హత్తుకున్నాములే ఒక్కరల్లే
ఈ మనసు మనసు కలిసేలా ముట్టుకున్నాములే ముద్దులల్లే
కన్నీల్లైనా గుండెలో గంగలు యమునలై
నూరేళ్ళైనా చాలనీ తలపులు తపనలే
నీ కొరకే నా ధ్యానం అ: నీ వెనకే నా ప్రాణం
కనులే తడిసే వలపు చినుకులివి ||రాదుకదా||

చరణం 2

జత కలిసి కసక తింటుంటే కాకి ఎంగిళ్ళి కవ్వింతలాయె
ఏ చిలిపి చిచిపో అంటుంటే తమ్మెదేలోన తళ్ళింతలాడే
కాలాలన్నీ వేసవి గాలులై తాకెలే
కాటేస్తున్నా వెన్నెలే జోలలే పాడెలే
నను మరచిపోతున్నా
నా మనిషే అనుకున్నా మనసే మురిసే మెరుపుకలలుఇవి ||రాదుకదా||

వాన వాత్సాయన వయసార వాటేయనా

పల్లవి

వాన వాత్సాయన వయసార వాటేయనా
తేనె వరదాయెనా కనులార నినుతాకనా ఆ: నీవని మరి నేనని
దేహమె ఇకలేదని సరసాలాడ సఖియా నాతోరావ ||వాన వాత్సాయన||

చరణం 1

తొలిజల్లు కురిసింది తనవంతుగా చలిగాలి తరిమింది చెలచెంతగా
పడుచు ప్రాయాన పడితె ఈ వాన పరవసాలేగమైన
హరివిల్లు విరిసింది హరినల్లగా చిరుసిగ్గు కరిగింది మెలమెల్లగా
చిలిపి దాహాలు వలపు మోహాలు చిటికెలేసాయిలోన
జడివానలో ఎద తడిసిందిగా ఆ: జత చేరవా సిగ రగిలించగా
ఇక సరిలేని సఖియా నాతోరావ ||వానవాత్సాయన||

చరణం 2

వణికేటి పెదవుల్లొ వలపుందిగా నీ పెదవితో వరస కలిపిందిగా
లేత హృదయాలు ఏకమయ్యేల లేఖ రాస్తోంది వాన
ఉరికేటి వరదల్లో ఊపుందిగా నాకోరికే తాను చూపిందిగా
నేను నీలోన లీనమయ్యేల బాణమేస్తోంది వాన
ఈ నేలకు ఆ మేఘాలకు ఆ: స్నేహాలవారది వానేకదా
మరి నిను నన్ను కలిపింది తానే కాదా ||వానవాత్సాయన||

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా

పల్లవి

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఏనాటికి నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే నా ఆరోప్రాణం అంటున్నానే
కలకాలాలు నీతో చేరి ఉంటానేనే
ఇక నీతోనె ఏకం అవుతూ లోకాలె నే మరిచేన ||ఓ చంద్రమా||

చరణం 1

ఓ గోరింక నూరేళ్ళింక తోడే నీవై ఉండాలిలే
ఓ నామైనా ఏ జన్మాన నీకే జంటై ఉంటానులే
నీ గుండెలోన ఉన్నంత ప్రేమ ఆ కళ్ళలోన చూశా ఈ వేళ
చేశాక నిలపాలి బాస ఓ హొ హొ......
ఇచ్చాక మాట విడిచేన బాట విడిపోయే వరకు నా శ్వాస
ఓ చంద్రమ మచ్చేలేని ప్రియబంధమా
ఓ అంధమా నా ప్రియరాణి నీవే సుమా

చరణం 2

అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకు ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేనే నీతోన నేనవుతూ వేళ నీ పూల వాన
స్వప్నాలలోన నిలువెల్ల పూలకించి పోన హ హ ...
నేనే నీవైనా నావేణులోన రాగాలు రవళించుకోనా
ఓ అందమా నాప్రియరాణి నీవే సుమా ఏనాడిక నిన్నే వీడిపోలేనుగా
ఇక నీవే నా ఆరోప్రాణం అంటున్నాలే కలకాలాలు నీతో చేరి ఉంటానేనే
సఖి నీతోనె ఏకం అవుతూ లోకాలె నేమరిచేన
ఓ చంద్రమా అ: ఓ అందమా

నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా నేనేనాడు అనుకొని మైమరపులా

పల్లవి

నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా నేనేనాడు అనుకొని మైమరపులా ||2||
చిరుగాజుల్లె అలా రివ్వంటున్న సవ్వల్లలోన విన్నానులే ఇలా జుమ్మంటున్న రాగాల వీణ
సెగనిప్పుల్లే అల్లా చెరిగేస్తున్న మాసాలలోన కురిసిందిలే ఇలా నా ఎదలోన ఆ మంచు వాన
శతకోటి వర్ణాల సరికొత్త ఋతువల్లె ఈ లోకమే మారెనా ||నన్నొచ్చి||

చరణం 1

ఆ కారుపొగలైన మేఘాలుగా కనిపించెలే ఈ నాకంటికి
ఈ తీరు అదిఏమొ కొన్నాళ్ళుగా రుచిలేదులే ఈ నానోటికి
అలా చక్కనై అలై జాబిలి నన్నే తాకిపోయింది అవునా మరి
ఇలా నా మది అదేదో అయ్యి - ఎదో ఏదో అవుతోంది ఏమో మరి
అదో గుండమై నాకోసమే దిగివచ్చె ఆకాశమే ||నన్నోచ్చి||

చరణం 2

వేవేల తారల్ని కనువిందుగా విరభూసిలే ఈ పూదోటలే
నాకేమొ తొలిసారి మహవింతగా తరువాయెలే ఈ ఆ మాటలే
ఒక్కో దిక్కులా కుక్కుపిట్టలా రెక్కేకట్టి ఎగిరాయి నాఊహలే
నిద్రేపట్టని ఇదేం పిచ్చని నన్నే చూసి నవ్వాయి జడపువ్వులే
అలా నింగిలో నెలవంకనే గెలిచాయి నా ఆశలే||నన్నొచ్చి||