Showing posts with label * ఉష. Show all posts
Showing posts with label * ఉష. Show all posts

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస...

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో.. శ్రుతి కలిపి పాడగా
నీ నీడలో.. అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా ||నువ్వంటే||

చరణం 1

నువ్వు నావెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుకుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా.. ఇలా నన్ను చేరగా..
సుదూరాల తారక.. సమీపాన వాలగా..
లేనేలేదు ఇంకే కోరికా.. ఆ... ||నువ్వంటే||

చరణం 2

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సన సన్నగా చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీరేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా.. ఆ... ||నువ్వంటే||

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా..

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా
తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో
తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై
అందవా.. స్నేహమా.. ||నే తొలిసారిగా||

చరణం 1

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా..
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా..
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా..
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా..
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే.. పంచుమా.. ||నే తొలిసారిగా||

చరణం 2

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా..
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా..
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా..
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా..
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా.. తీరులో ప్రళయమా..
పంతమా.. బంధమా.. ||నీ ఆటేమిటో||

అందమైన మనసులో...

అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో.. ఎందుకో.. ఎందుకో...
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో.. ఎందుకో.. ఎందుకో...
ఎందుకో.. అసలెందుకో.. అడుగెందుకో...
మొదటిసారి ప్రేమ కలిగినందుకా... ||అందమైన||

చరణం 1

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయినా తక్కువేమీ కాదే ప్రేమకు సాటేదీ లేదే
రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు
మనసులొకటయ్యేనా...
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా... ||అందమైన||

చరణం 2

ఓర నవ్వుతోనే ఓనమాలలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ
గాలివాటు కాదేమైనా...
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవె ప్రేమ దీవెన... ||అందమైన||

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే
అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా... ఆ... ||2|| ||చినుకు||
సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమదని
సాస నీని దాద మామ గమదని రిసదా
నిని దద నిని గగ నిని దద నిని గగ
సగమగ సనిదని మదనిస నిస గసగా

చరణం 1

పసిడి వేకువలు పండువెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్లముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా...
ఆ... ఆగని సంబరమా... ||2||
సగమద రిస ననిదమగసగ
సనిస సనిస నిస నిస నిసగారిస ||2||
దాద నీని దద నీని దదనిగససా

చరణం 2

వరములన్ని నిను వెంట పెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నదే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మరునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనలు
వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలుకవమ్మా... ఆ...
కాముని సుమశరమా
ఆ... కాముని సుమశరమా ||చినుకు||

బృందావనమున అందెల రవళులు చిందు వేసేదెందులకు

[అతడు] కృష్ణ హరే
[ఆమె] శ్రీ కృష్ణ హరే
హరే కృష్ణ హరే... ||3||
కృష్ణ హరే భజే కృష్ణ హరే... ||3||
కృష్ణ భజే...
[అతడు] బృందావనమున అందెల రవళులు చిందు వేసేదెందులకు
[ఆమె] గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకు
అందరికీ అందించుటకు
[అతడు] గోకులమున ఏ కులమైన గోపాలుని కొలుచేదెందులకు
[ఆమె] కులము అని వ్యాకులము బాపు కొలువైవుంటానని తెలుపుటకు
[ఆమె] నల్లానల్లని మేఘం లాగా నడిచొస్తాడు ఎందులకు
[అతడు] చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు
మనలను ముంచి వెళ్ళుటకు
చెంగు చెంగుమని గోవుల మందలు పరుగులు తీసేదెందులకు ఎందులకు
చెంత చేరి గోవిందుని సన్నిధి పరమపదమ్మని చాటుటకు ||హరే కృష్ణ|| ||భజే కృష్ణ||
[అతడు] హరే...
[ఆమె] హరే...

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ||2||
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

చరణం 1

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతీ
గాలిలో పరిమళం నాకు చెబుతున్నదీ ||2||
ఎపుడో ఒకనాటి నిన్ననీ
ఇపుడూ నిను చూపగలననీ
ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదేలా... ||చెప్పవే||

చరణం 2

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలనీ
గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ ||2||
నీ తలపులు చినుకు చినుకుగా
దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడా
కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా.. ||చెప్పవే||

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగబంధం ప్రేమే వేదమంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని
మనకున్న బలమే ప్రేమ ప్రేమా ||నువ్వేనాకు||

చరణం 1

నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమలేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచభూతాలు ||నువ్వేనాకు||

చరణం 2

నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే
చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటూ లేనిదే ప్రేమనీ
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు ||నువ్వేనాకు||

ప్రియతమా ఓ ప్రియతమా

ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం ||2||
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా ||ప్రియతమా||

చరణం -1

ఎప్పుడో అపుడెప్పుడో
ముడిపడినదీ బంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందిలా
పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో
ఈ వింత మాయనేమంటారో ||ప్రియతమా||

చరణం -2

గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎదనిండా నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో
ఈ వింత మాయనేమంటారో ||ప్రియతమా||
నిన్ను చేరిందని తన మనసు విప్పిందనీ
ఐ లవ్‌ యూ అంటోందనీ తెలుసా ||2||

శ్రీహరి సరాసరి తాకితే

పల్లవి

[ఆమె] శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగె
దూరినట్టుంది కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది
[అతడు] సరెసరె రా మరి హుటాహుటి ఇంతలో ఇదేమిటి ఆగలే
నంటు పైటె గోలపెట్టింద ఆదుకొమ్మంటు నాకే కన్నుకొట్టింది
[ఆమె] ఆపసోపాలు పడలేను కాని కాస్త కరుణించు నారాయణ
[అతడు] రాహుకాలాన్ని రావద్దు అంటు రాత్రి తెల్లార్లు పారాయణ
[అమె] వస్తాడు నువ్వేలారా ఎవ్వరేమన్నాడు
[అతడు] ముస్తాబు వచ్చేసింది ఏ సుగుణ ||శ్రీహరి సరాసరి||
[ఆమె] ఆవురవురు అంటునే ఆశ పడుతున్న
[అతడు] ఆ సంగతి ఈ రోజె ఆలకిస్తున్నా
[ఆమె] వయసు మాగాణి నికిచ్చుకుంటూ రైతువై పంట పండించుకో
[అతడు] పదును చూడందె నేవదులుతానా అప్పగించేసి నువ్వురుకో
[ఆమె] వయ్యారితో ఇవ్వాళిలా
[అతడు] కయ్యానికే కాలు దువ్వాలటా ||శ్రీహరి సరాసరి||
[ఆమె] ముట్ట గట్టిన బంగారం ముందరెడుతున్నా
[అతడు] నీ వంపుల(Temple) టెంపుల్‌ లో పూజకొస్తున్నా
[ఆమె] కూత పెడుతోంది పరువుల కోడి మూతపెట్టేసి ముద్దాడుకో
[అతడు] రెచ్చగొట్టాక నేనాగుతాన పుంజునవుతాను పూలకించిపో
[ఆమె] ఏకాకీ ముఖాముఖి షికారుకే సిద్ధమవ్వలట ||శ్రీహరి సరాసరి||

సాల్సా ఇద సాల్సా

పల్లవి

[ఆమె] సాల్సా ఇద సాల్సా హై క్లాసు డాన్సు సాల్సా
[అతడు] హంస కలహంస ఈ డ్రిల్ పేరు డాన్సా
[ఆమె] సాల్సా మాసాల్సా నీ వల్ల కాదు తెల్సా
[అతడు] స్టెప్సా అవి ఫిట్సా మాకెందుకింత హింసా
[ఆమె] నోటికొచ్చినట్టు పిచ్చి కామెంట్సా
[అతడు] అరె ఉన్నమాటి చెప్పుకుంటె ఫీలింగ్సా
[ఆమె] నిను బొట్టుపెట్టి పిలిచినట్టు జోలికొచ్చి ఏంటిరభసా
[అతడు] మాతో పెట్టుకోకు మాతో రెచ్చిపోకు పిచ్చికా మేంతీర
మారత్తుకుంటే తోకే ముడుచుకోవాపిచ్చుకా ||సాల్సా||

చరణం 1

షర్టు కొంచెం మడిచికట్టి నాలుకిట్టా మడతపెట్టి దుమ్ము రేపే బస్తీలే మావిలే
[ఆమె] ఒకటి రెండు లెక్కపెట్టి బీటుమీద మనస్సుపెట్టి స్వింగు చెయ్యడం ఈజి కాదులే
[అతడు] చాల్లే బడాయేలే నైసు పాపా ఊరికేలడాయేలా పట్టుకోకా
యాలో కలేజాలు ఓర్చలేకా ఏవోకహానీలు చెప్పమాకా
[ఆమె] గల బాకులోకి గయ్యమంది రామ రామ మీరా మేమా ||సాల్సా||

చరణం 2

టింగురంగా ఇంగ్లీషు ఎంగిలాట లెందుకంటా కింగు లాంటి మాస్టైలే నేర్చుకో
[ఆమె] ఊర నాటు చిల్లరాట అంత సీనులేనిదంటూ బీరపాంటు మేళాలే మానుకో
[అతడు] లోకల్ డాన్సు మీకులోకువెందుకే ఫారన్ జాబుమీద
మొజా దేనుకో వెస్టెన్ టేస్టులోని ఎక్కువేమిటో మేడిన్ ఆంధ్రకబ్నా తక్కువేమిటో
[ఆమె] నీ బ్రైను వాషు చాలు చాలు వెస్ట్‌టేస్టు మాదేననుకో ||సాల్సా||

నీ పక్కనుంటే పగలే వెన్నెల

పల్లవి

[అతడు] నీ పక్కనుంటే పగలే వెన్నెల నేనెక్కడుంది గురుతే రాదెలా
నా నిదురను దోచావే కల ఉవ్వాహు ఉవ్వాహు ఉవ్వాహు
మైకంలో ప్రేమా స్వాగతం నీ పేరే హద్దుకు శ్లోకం
I Love You సంయుక్తతా వెబ్‌సైటుకి నువ్వే లౌక్యం
నువ్వు స్టైలిస్తే నీ ఫ్యాషన్‌ నువ్వంటే నే ఎట్రాక్షన్‌ యుసోప్‌
బాయ్‌ ఐ బాడ్‌ బాయ్‌ ఐ ఎవ్రిడే లవ్‌ సన్‌షై సన్‌షై

చరణం 1

నాలోని మనసును కలుసుకున్నా కలలు కన్నా కలలుకన్నా
నేనే నన్నెవరని అడుగుతున్నా తెలుసుకున్నా తెలుసుకున్నా
[అతడు] ఇన్నాళ్ళు నీడలో దాగున్నది ఆలోచన నీ వల్లే ఈ నిజం
విన్నావని నే నమ్మనా ప్రేమంటే కలిసున్నా అది నీలోనే చూసున్నా
ఏ ఎండావాన ఎందుకే నువ్వే నా ఎవ్రి సీజన్‌
నే పుట్టిందంటూ ఎందుకే నీ నవ్వే ఓన్ని రీజన్‌
నువ్వేమో రంగుల ప్యూచన్‌ వితేయుసో కన్‌ఫ్యూషన్
మేరె ధన్‌మన్‌ జానే మన్‌ మీరే దిల్‌కి తుహి దడకన్‌ దడకన్‌

చరణం 2

నీ రోజా సొగసుకు పరవశమే పంచిందెవరే పంచిందెవరే
లేలేత పెదవికి ఎరుపునలా పెంచిందెవరే పెంచిందెవరే
[ఆమె] ఏమో ఏరోమియో పూబాణమో ఏమోమరి
నీ కైనా తెలుసునా ఈ నాడిలా అవుతుందని
[అతడు] ప్రేమంటే వింతేలే ప్రేమిస్తే ఇంతేలే నా గూబుల్‌ కళ్ళ సర్చ్‌
లోనీ ప్రేమెక ఎన్నోవేషన్‌ నీ బబ్లీ బుగ్గలో టచ్‌లో
అయిపోనా హల్వా మెడిసన్‌ నీ బ్యూటి నా కొక ఫ్యాషన్‌
మై ఓన్లి న్యూ సన్‌సేషన్‌ మై ఓషన్‌ లవ్‌ ఓషన్‌ మై లవ్లీ లవ్లీ కాజ్‌బ్రేషన్ ||నీ పక్కనుంటే||
‌

అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో

పల్లవి

[అతడు] అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
[ఆమె] అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడు అవుటయ్యో
[అతడు] అరెసోకుల్లో సెగ చూపనీ
[ఆమె] ఎరుపెక్కించే ప్రతి చంపనీ
[అతడు] కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మె ఎంచక్కా ||అయ్యయయ్యో||

చరణం 1

[అతడు] సోకుల ఎరనే చూపి "చిరు" కాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలిలాగ చెక్కైమాకె పోరి
[ఆమె] చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి
తుంటరి గుంటడు మారనంటే ఎట్ట వేగేదేంటి
[అతడు] ధీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావ చక్కెరకేళి
[ఆమె] పైట రాగాల కోటలో కింక చేరవా బ్రహ్మచారి
[అతడు] అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నెరజాన మత్తెకిందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మొహమాటం చెట్టెక్కిందయ్యో

చరణం 2

[ఆమె] అచ్చిక బుచ్చికలాడి నును వెచ్చని తాకిడితోటి
నిప్పుల దుప్పటి చప్పున పెడితె ఎట్టా ఆపేసేది
[అతడు] వెన్నెల పందిరి వేసి మరుమల్లెల మంచం‌వేసి
ఇద్దరి మధ్యన దుప్పటి కడితె జోరొగ్గాల బేబి
[ఆమె] చాటుగా వచ్చి చేతివాటాన చేయవోయ్ ఇంక వన్నెల బోని
[అతడు] లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల బోమా ||అయ్యయయ్యో||

బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ

పల్లవి

బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్‌ పాడరద్ది కుంకుమెట్టి
ముస్తాబయ్యొస్తే అడుదామే కోక్కో కోలాటం
చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే
చూపుతాలె కుర్రాడి వాటం
మల్లీ మల్లీ నా మామా మల్లీ
మల్లీ మల్లీ నా మామా మల్లీ హాయ్ డాబు చాలు గాని
బాబూ నీ చెంత కొస్తే
ముగ్గులాగ ముడిచేసుకుంటావ్‌
గడ్డి వాము చాటు కొచ్చినే సైగచేస్తే సిగ్గుతోటి లగ్గెత్తుకుంటావ్‌
ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే
కిట్టయ్య లాగా మా బాగా వున్నావే
అందాల రాధమ్మ నువ్వు గాని అయితే
నీ పక్కనేను కిట్టయ్య నవుతాలే
అమ్మదొంగ ఎటకారం వద్దు
ఇంక నాతో చెలగాటం వద్దు ఒక్కటయ్యే వీలే లేదా
ఓ వెన్నదొంగా ఈ కన్నెబెంగ తీరేది ఎట్టాగా
నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా ||బుల్లీ బుల్లీ||
నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్ళి
ముత్యాల హారం చేయించి ఇస్తాలే
నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్ళి అద్దాలమేడ కట్టించి ఇస్తాలే...
అయ్య బాబాయ్‌ గాలే కొట్టొద్దు
నువ్వు కూడ అట్టే మొయ్యెద్దు నేనంటేను ప్రేమేలేదా
వయ్యారి బాలా ఓ మేఘమాలా పండింది నా పంటా
ఓ చందమామా నా మేనమామా నేనేగా నా జంటా ||బుల్లీ బుల్లీ||

లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా

పల్లవి (శ్లోకం)

[ఆమె] లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా
శ్రీ రంగ ధామేశ్వరి దాసీ భూత సమస్త దేవ వనితా
లోకైక ధీపాకురా శ్రీమన్‌ మంధ కటాక్ష లబ్ధవీభువ
బ్రహ్మేంద్ర గంగాధరా తోం త్రైలోక కుటుంబుని
స్వరసిజా వందే ముకుందా ప్రియా వందే ముకుందా ప్రియా

నిను నీవే సరిగా కనలేదే మనసా

పల్లవి

[అతడు] సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏకంటికైన
రెప్పల దుప్పటి కప్పేచీకటి చూపించేనా ఏకాంతినైన
[ఆమె] నిను నీవే సరిగా కనలేదే మనసా
[అతడు] నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా ఏవో జ్ఞాపకాలు
సుడిదాటి పడలేవా ఎన్నో తీపి సంగతులు రేపు పిలుపు వినవలేవా

చరణం 1

[అతడు] చంద్రుడి ఎదలో మంటని తుమ్మెర అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు కనక కాక్షాలు అడిగి ఎవరైనా
ప్రాణాం ఇనికిపైన అనుమానపడరు ఎపుడైనా ||నిను నీవె సరిగా||

చరణం 2

[అతడు] పోయింది వెతికే వేదనా పొందింది ఎదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలచేదెపుడో
సందేహం కలిగే నదికి కలతను తీర్చేదెవరో
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా ||నిను నీవె సరిగా||

లంగావోణి నేటితో

పల్లవి

[అతడు] లంగావోణి నేటితో రద్దైపోని సింగారాన్ని చీరతో సిద్దం కాని
నిన్నలా తనలా తుళ్ళకే అమ్మాడి చిందుతే ఆపగా ముళ్ళు వెయ్యని
[ఆమె] సర్లేగాని పక్కగా పెళ్ళైపోని అల్లర్లన్ని జంటలో చెల్లైపోని
లగ్నమే పట్టబై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించని... ||లంగావోణి||

చరణం 1

[ఆమె] చూడు మరీ దారుణం ఈడు నెలా ఆపడం వెంటపడే శ
త్రువయ్యే సొంత వయ్యారం
[అతడు] ఏ ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్ళెదురే
ఉంది కదా ఇంత సహయం
[ఆమె] పుస్తే కట్టెయ్ పుచ్చుకో కన్యాదానం
[అతడు] సిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం... ||లంగావోణి||

చరణం 2

[అతడు] సోకు మరి సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం
పాలదుగా గాలి ధుమారం
[ఆమె] కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలిపడే లాలనతో
రంగ దుభారం
[అతడు] ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చే దిచ్చి
[ఆమె] ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చి గిచ్చి... ||లంగావోణి||