Showing posts with label * శ్రీకుమార్‌. Show all posts
Showing posts with label * శ్రీకుమార్‌. Show all posts

గోరువంక వాలుగానె గోపురానికి...

గోరువంక వాలుగానె గోపురానికి
స్వరాల గణ గణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలా కిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే.. వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే.. వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసి అందమైన బాలుడే తనవాడై... ||గోరువంక||

చరణం 1

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన...
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల్లా పడ్డట్టున్న
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపమలంటా దిక్కుల్లో..
ఎవరికి వారే... ఏ... యమునకు తీరే..
రేవు నీరు నావదంట
నావ తోడు రేవుదంట పంచుకుంటే... ||గోరువంక||

చరణం 2

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన పూలసొగసల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వె సిగ్గందాల పిల్లనవ్వె
బాలయ్యొచ్చి కోలాటాడె వేళల్లో
పైరందాల చేలు నవ్వె పేరంటాల పూలు నవ్వె
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడె పొద్దుల్లో
పరవశమేదో ఓ... పరిమళమాయె... ఏ... ఓ...
పువ్వు నవ్వె దివ్వె నవ్వె
జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే... ||గోరువంక||

మనసుపడి మనసుపడి మన్మధుడే మనసుపడి

పల్లవి

మనసుపడి మనసుపడి మన్మధుడే మనసుపడి ||2||
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే ||2||
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీకోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే ||2||
నా గుండెలే ఆటస్ధలముగా ఏ గిరిగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్లికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులుపెట్టి మణికట్టుకు గాజులు తొడిగి
ఈరోజా చేతికి రోజాపువ్వు అందించు ||గోరింట||
నీ వరుడు రేపు వేంచేస్తాడు తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్లి వేదికను నే వెయ్య ఆవరుడు చేయి నీకందియ్య
నీతండ్రి మది ఉయ్యాలలూగ

చరణం 1

ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనాపెదవి మొదలలేదు ||మనసు||
ఆదుకున్న దైవం - ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతో
నా కనులనిండుగా నీరూపం నిను తలచుకొనడమే నాధ్యేయం ||2||
నీ ఆనందమే నాసంతోషం నాప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం ||మనసు||

చరణం 2

కలువ కళ్లకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోనా మొగలిపూలు పేర్చి ||కలువ||
విలువ కట్టలేని మణులు ఎన్నోదాల్చి
హంసలాగ వేదిక కొచ్చే చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టెలే పెళ్లికొడుకు ||మేళ||
ఈ పేదహృదయమే దీవించే పూలజల్లే కురియు వర్ధిలు కలకాలం ||మనసు||

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ

పల్లవి

[అతడు]దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్‌ పడుచులు ఆడప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేయనా ఈనాడు ||చెలి||
తనజాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా ||తన|| ||దాండియా||

చరణం 1

[అతడు] నిన్ను చూసి నన్ను నేను మరచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆమాట తెలిసిందా
[ఆమె] నిన్ను చూసి నాలో నేను మురిసి
అసలుమాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
[అతడు] ఓ... కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసి నేను కున నల్లుకుంటా
[ఆమె] ఓ... కళ్లలో నాకాటుక కరిగిపోవునంట
కురులలోనా పువ్వులన్ని వాడిపోవునంట
[అతడు] నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
[ఆమె] ఈమాట మాత్రమే నిజమైతే
నాజన్మే ధన్యం
[అతడు] నాప్రేమ [ఆమె] నీవేలే ||2|| ||దాండియా||

చరణం 2

[ఆమె] ప్రేమని చూపులో వుంది మహత్మ్యం
ప్రేమభాషలో వుంది కవిత్వం
ప్రేమించుటలో వున్నది దైవత్వం దైవత్వం
[అతడు] ప్రేమసృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈలోకం భూలోకం
[ఆమె] ఓ... నామనసు నీలో దాచి ఉంచినాను
ఆ మనసు క్షేమమేనా తెలుసుకొనగ వచ్చాను
[అతడు] ఓ... నీ మనసు పదిలంగా దాచి వుంచినాను
నాకంటే నీమనసే నాపంచప్రాణాలు
[ఆమె] హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
[అతడు] ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
[ఆమె] నాప్రేమ [అతడు] నీవేలే ||2||
యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి ||యువతీ||
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించైండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి ||2||