Showing posts with label - భాను చందర్‌. Show all posts
Showing posts with label - భాను చందర్‌. Show all posts

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రానున్న ఎదలో రాగాలమాలై
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

చరణం 1

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా ||2||
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను ||జాబిల్లి||

చరణం 2

నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో ||2||
ఈ వెల్లువలో ఏమౌతానో
ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిజేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో ||జాబిల్లి||
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

లలలా లలలలా లలలా లలలలా...
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ||2||
ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ||2|| ||ఆకాశం||

చరణం 1

ఏ పువ్వు ఏతేటిదన్నది ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏమోవిదన్నది ఏ పొద్దో రానున్నది
బంధాలై పెనవేయు వయసుకు
అందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు మధువులనే
చవిచూడమనగ
పరువాలే... ప్రణయాలై... స్వప్నాలే... స్వర్గాలై...
ఏన్నెన్నో శృంగారలీలలు కన్నుల్లో
రంగేళి అలరును ||ఆకాశం||

చరణం 2

ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసి
మరపించమనగ
కౌగిలిలో చేరవేసి మదనుని కరిగించి
గెలిపించమనగ
మోహాలే... దాహాలై... సరసాలే... సరదాలై...
కాలాన్నే నిలదీసి కలలకు ఇవ్వాలి
వెలలేని విలువలు ||ఆకాశం||