Showing posts with label - మీరా చోప్రా. Show all posts
Showing posts with label - మీరా చోప్రా. Show all posts

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ||ఎదుట||

చరణం 1

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతె ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధం అల్లుకుందే.. జన్మ ఖైదులా ||ఎదుట||

చరణం 2

నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో వ్రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ||ఎదుట||

ఆకాశగంగా... దూకావె పెంకితనంగా

ఆకాశగంగా... దూకావె పెంకితనంగా
ఆకాశగంగా...
జలజల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా ||ఆకాశ||

చరణం 1

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే ||2||
చిటపటలాడి వెలిసిన వానా
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడి ||ఆకాశ||

చరణం 2

ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా ||2||
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవే అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా ||ఆకాశ||