Showing posts with label * సాగర్. Show all posts
Showing posts with label * సాగర్. Show all posts

కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

$కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ ||కరిగేలోగా||

చరణం 1

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా ఇట్టే విడదీసే వీలుందా ||కరిగేలోగా||

చరణం 2

అడిగినవన్ని కాదని పంచిస్తూనే మరునిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటను చూస్తుంటే నా బాధంటటి అందంగా ఉందే
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే మరుజన్మే ఓ క్షణమైనా చాలంటే ||కరిగేలోగా||

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో...

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

చరణం 1

ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతిపలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

చరణం 2

ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే... కల నేనౌతా
నా పాదం నువ్వైతే... నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే... వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై
సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ ||నా పెదవులు||

చరణం 1

కనిపించని బాణం నేనైతే...
తియతీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే... నేనెదురౌతా
వినిపించని గానం నేనైతే...
కవి రాయని గేయం నేనౌతా
శ్రుతిమించే రాగం నేనైతే... జతి నేనౌతా
దిగి వచ్చే నెచ్చెలి నేనౌతా
నిను మలిచె ఉలినే నేనైతే
నీ ఊహలు ఊపిరి పోసే
చక్కని బొమ్మను నేనౌతా ||నా పెదవులు||

చరణం 2

వేధించే వేసవి నేనైతే... లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే... మైమరపౌతా
నువ్వోపని భారం నేనైతే...
నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే... రారమ్మంటా
వణికించే మంటను నేనైతే...
రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే
ఎరుపెక్కిన చెక్కిలి పంచిన
చక్కెర విందే నేనౌతా ||నా పెదవులు||

చూపుచాలు ఓ మన్మధుడ

చూపుచాలు ఓ మన్మధుడ
ఆగనంది నా గుండె దడ...
తెలుసుకో సుందరా...
నా మనసులో తొందరా...
మాటచాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక...
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ...
కలుపుకోవా నన్ను నీలో
యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా ||చూపుచాలు||

చరణం 1

ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని
ఇలా దరికి పిలుచుకోనా...హే...
ఆడించు నన్ను పాడించు నన్ను
నీ హాయి నీడలో
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||

చరణం 2

ఆడ మనసులో అభిలాష
అచ్చ తెలుగులో చదివేశా...
అదుపు దాటి వరదయ్యింది
ఈ చిలిపి చినుకు వరసా... హే...
నన్ను నేను నీకొదిలేశా
ఆదమరుపులో అడుగేశా
అసలు కొసరు కలిపి తీసుకో
వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని
అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||

పాదం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం

పల్లవి

పాదం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందె
దూరం కరగనుంటుందా తారలను దోసిటపట్టే ఆశలు దూసుకుపోతుంటే
లోతెంతొ అడగననే పడవల్లే అడుగేస్తె దారియ్యను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే
నిమిషం కోసం దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన ఐదో తనమని నీకైనో చే నో ముంటే నిత్యం
నీ జీవితమంతా పచ్చని పంట వదా
ఆ నేని పెదవులపై చిరునవై నిలిచే ప్రేమంటే
ఆ తీపికి విషమైనా అమృతమే అయిపోదా

పారిపోకే పిట్టా.... చేరనంటె ఎట్టా

పల్లవి

పారిపోకే పిట్టా.... చేరనంటె ఎట్టా ||2||
అంత మారాం ఏంటంటా మాట వినకుండా
సరదాగ అడిగాక మజిలీ చేస్తవా తీసుకుపో నీవెంట వస్తా తీసుకుపోనీవెంట

చరణం 1

నా సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా
ఏ బెంగా పడకుండా తన అందెలుగా తొడిగా నా చిందరవందన
సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
హోయ్ చినబోయిందేమో చెలికొమ్మా ఆగుండెల గూటికి
ముందే కబురియ్యవె చిలకమ్మా
నీవాడు వస్తాడే ప్రేమ అరె త్వరగా వెళ్ళి నువ్విన కధలన్ని చెప్పమ్మ కాకమ్మ ||తీసుకుపో నీ వెంట||

చరణం 2

ఆకలి కనిపించింది నిన్నెంతో నిదించింది అన్నం పెట్టనుపోవె అని కసిరేసావంది
నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నటుంది తన వద్దకు
రావద్దంటూ తరమే సావంటుంది
హోయ్ ఏ గారం చేస్తావె ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్ళంటు
ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం
ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడొ చెప్పమ్మ ||తీసుకుపోనీ వెంట|| ||3||

దీందీంధనన దిరన దోందనన

పల్లవి

దీందీంధనన దిరన దోందనన దీందీంధనన ధరదినను ||2||
వందేమాతరం గాంధిఓంకారం ||2||
ఓ బాపు నువ్వేరావాలి నీసాయం మళ్ళీ కావాలి ||వందేమాతరం||
జరిగే దుర్మాంగం ఆపాలి నువ్వే ఓమార్గం చూపాలి ||వందేమాతరం||
కళ్ళజోడుతో చేతికర్రతో కదిలే ఓ సత్యాగ్రహం
||కోరస్|| కదిలే ఓ సత్యాగ్రహం వెండి కొండలా సిరసు పండినా
యువకుల మించిన సాహసం ||కోరస్||యువకుల మించిన సాహసం

బక్కపలచని బాపుగుండెలో తూగే హిమాచలం గుక్కునరాల్లో ఉప్పొంగే
స్వాతంత్ర్య రక్త గంగాజలం సత్యమార్గమున మడమతిప్పని స్వరాజ్య
దీక్షమానసం అతడంటే గడగడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం
వందేమాతరం గాంధి ఓంకారం ||2||

చాకు.పిస్టల్.కొడవళి, గొడ్డలి ఎందుకు హింసాసాయుధం
||కోరస్|| ఎందుకు హింసాసాయుధం అవేశం కోపం ద్వేషం
కాదు చిరునవ్వే మన ఆయుధం ||కోరస్||చిరునవ్వే మన ఆయుధం
సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృ భూమికి గౌరవం మానవతే మనకెన్నడు
చెరగని అందమైన గాంధీయుజం వందేమాతరం గాంధీ ఓంకారం ||2||
భయం చెందని నెత్తురు చిందని గాంధి మహోద్యమజ్వాలలు గాలి తరంగాలై
వీచినవి ఈదేశంలో నలుమూలలు వందేమాతరం గాంధి ఓంకారం ||4||

జాబిలమ్మవో జాజికొమ్మవో

పల్లవి

[అతడు] జాబిలమ్మవో జాజికొమ్మవో గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనే పట్టువో
ఐడోంట్ నో వాట్‌యుడూ
ఇంటిముందు రంగవల్లెవో ఓ చెలి పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన బంతి పాటవో ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగ ||జాబిలమ్మవో||

చరణం 1

[అతడు] ఓ...నీ పెదాలపైన నా పెదాలతోన ||2||
ఆ పదాలు నీకు రాసి చూపన
[ఆమె] ఈ క్షణాలలోన అ యుగాలు దాటే ||2||
ఆ జగాలలోని ప్రేమ పంచనా
[అతడు] బొట్టు మీద బొట్టు పెట్టనా కాటు కల్లె కావరుండనా
[ఆమె] గుండె మీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా
[అతడు][ జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా ||జాబిలమ్మవో||

చరణం 2

[అతడు] హొ...నీ మనస్సులోకి నా మనస్సు చేరి ||2||
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగ
[ఆమె] నీ వయస్సు తోటి నా వయస్సు కూడి ||2||
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
[అతడు] ముత్యమంత ముద్దుపెట్టనా మూడుముళ్ళ బంధమేయనా
[ఆమె] వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా
[అతడు] రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజు నవ్వనా ||జాబిలమ్మవో||

నీటి ముల్లై నన్ను గిల్లి

కోరస్

[అతడు] నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన
జంటనల్లె అందమల్లె ఉండిపోవే వెండివాన
తేనెలు చినుకులు చవి చూపించు కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలలే మావనిపించి కనుమరుగై కరిగావా సిరి వానా
నువ్వొస్తానంటే నేనొద్దాంటానా...