Showing posts with label - సోనాలిబింద్రె. Show all posts
Showing posts with label - సోనాలిబింద్రె. Show all posts

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ...

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోందీ ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోందీ ఓ మోమాటం
నువ్వంటే మరీ అదేదో ఇదీ అనేద్దామనే వున్నదీ
ఫలానా అనీ తెలీదే మరీ ఎలా నీకు చెప్పాలదీ ||చెప్పమ్మ||

చరణం 1

వెంట తరుముతున్నావేంటీ ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా
చెంప గిల్లి పోతావేంటీ గాలి వీస్తున్నా
అంత గొడవ పెడతావేంటీ నిద్దరోతు వున్నా
అసలు నీకు ఆ చొరవేంటీ తెలియకడుగుతున్నా
ఒంటిగా వుండనీవేంటీ ఒక్క నిమిషమేనా
ఇదేం అల్లరీ భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా బాగుంటుందనీ నిజం నీకెలా చెప్పనూ ||చెప్పమ్మ||

చరణం 2

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా
ఏడిపించ బుద్ధౌతుందీ ఎట్టాగైనా
ముద్దుగానే వుంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ వున్నా
లేని పోని ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడకా మహా boreగా ఎటో నువ్వు చూస్తూ వున్నా
అదెంటో మరీ ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా ||చెప్పమ్మ||

ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే

గోగులు పూచే గోవులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ ||2||
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చ గుమ్మాడీ
పుత్తడి వెలుగులు ఊ హుహు హూహూ.. ఓ లచ్చ గుమ్మాడీ...
ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే వుందీ
చెలీ చూడు నా చేవ చుట్టేసేందుకే వుందీ

చరణం 1

నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నేను గెలిచేందుకే నీకు పొగరున్నదీ
ఒక్కటయ్యేందుకే ఇద్దరం వున్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నదీ ||అలా అంటూ||

చరణం 2

వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా
నీ కళ కళ కళ కళ మోముని చూస్తూ వుంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ వుంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నదీ
నీ వాడిగా వుండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నదీ ||అలా అంటూ||

వాలు కనులదానా

పల్లవి

వాలు కనులదానా ||2|| నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే

చరణం 1

చెలియా నిన్నే తలచి కనుల జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండాపోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్లంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా ||మీటితే||
నిను నేను చేరుకోనా ||వాలు||

చరణం 2

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని జరుగు
రసవీణ నీ మేను మీటాలి నామేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్ర మిక్కడున్నది
నిండు ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందంట చెలియా ||జక్కన్న||
నీ సొగసు కేదిసాటి ||వాలు||

నా వయసే పాదరసం నేనసలే చిన్నరసం నా పెదవే ద్రాక్ష

పల్లవి

నా వయసే పాదరసం నేనసలే చిన్నరసం నా పెదవే ద్రాక్ష
రసం నానడుమేనాగస్వరం నాసోకు పూలవనం నా చూపు
నీకు వరం అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం ఓయ్‌
హేయ్‌ నాపేరే కాంచనమాల నావయసే గరం మసాలా
తందానతాన అంటు మొగనీ తబలా
హోయ్‌ రావే నా రసరంగీళా నీ బుగ్గే నా రసగుల్ల
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
కలిసొస్తా కానివేళ కైపెట్టే కన్నులా నీదేరా రాకుమారా
దోరదోర ఉడుకుల ఉయ్యాలా ఊ ఊ నను అల్లుకో అల్లుకో
ఆ ఆ నన్ను గిల్లుకో రా హేయ్ నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓ ఓ
ఊ నిన్ను తాకనా తాకనా ఆ ఆ నిన్ను చుట్టుకోనా
ఏ ముద్దుపెట్టనా పెట్టునా ఆ ఆ ఆ ఆ ఓయ్‌

చరణం 1

నీ రాకలో రాపిడుంది నా సోకులా దోపిడుంది నీ దొంగ
చూపుకే నా బెంగ తిరునా నువు ఉండిపో రాత్రికి
నీ మీదనే మోజు ఉంది ఈ రోజునే రాజుకుంది ఏ ఫోజు
కొట్టనా ఈ పోరు తప్పునా తెల్లారు సయ్యాటకి
మాయాబజార్ మల్లెపూలకి వేళాల వెర్రి నాకు లేలే
పారాహుషార్ పట్టుచిక్కరో మావ మావ ఓ మావా
కావాలిలే గజ్జికాయలే నీ కళ్ళు గజ్జికాయలే ఆడాలిలే
కచ్చకాయలే బామ బామ ఓ బామ ||ఉఉ నన్ను అల్లుకో ||నా పేరే||

చరణం 2

నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెల్లో గుచ్చుకుంది
ఏ మాట చెప్పిన ఆ మంట తిరునా నన్నాపకే ఇప్పుడు
నీ చూపులో సూదివుంది, ఆ సూదంటునా లాగుతుంది
నువ్వంటు తొక్కినా నావంటి చక్కనా నే మోయలేనిప్పుడు
వస్తే ఇస్తావా బాలివుడ్‌లో చిత్రాంగి చీరకట్టాదాయె
చారుమినార్ సొట్టుబుడ్డివే బామ బామ ఓ బామ
దాసిచ్చినా పూతరేకునే లేలేత కొత్త సోకులే
ముట్టించనా ముంజకాయలే మావ మావ ఓమావ
||ఉఉ నన్ను అల్లుకో|| ||నా పేరే కాంచనమాల||

శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S., శంకర్ దాదాM.B.B.S.

పల్లవి

శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S., శంకర్ దాదాM.B.B.S.
హెయ్‌ బేగంపేట బుల్లెమ్మా అరె పంజాగుట్టా పిల్లమ్మో||2||
బాడిలోన వేడేచూసి గోళీ వేస్తానమ్మో ఓయ్‌ చింతర్‌బస్తి చిట్టెమ్మో
కూకట్‌పట్లి కిట్టమ్మో బాదే నీకు లేకుండానే దూదెరాస్త అమ్మో
ఏయ్‌ హైదర్‌గూడ గుండమ్మో శంకర్ దాదాM.B.B.S.
అరె సోమల్‌గూడ గుండమ్మో శంకర్ దాదాM.B.B.S.
అరె హైదర్‌గూడ గుండమ్మో దోమల్‌గూడ గుండమ్మో
వాటంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్త్తుచిత్తేనమ్మో కో:నీపేరేందబ్బాయా
దా. దా. దా. దా. దా. దా. దా. శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S. ||4|| ||బేగంపేట||

చరణం 1

నడవలేనివారు ఊరికే లాగ కో: నేపెంచుకున్న కుక్కనొదులతా హె హేయ్‌
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగ,
నేరాసుకున్న కవిత చదువుతా హెహెహెయ్‌
అరె మూర్చపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మళయాళం ఫిల్మ్‌ చూపుతాఅహ జంతర్ మంతర్‌ జాలీ
అరె జూమంతర్‌ కాళీ నీ బతుకుల్లో బాధలేన్నున్నా చిన్న చిరునవ్వె మందు ఓరన్న
నిన్న హసీరనప్పు అ:నన్నిహసిరా అహ్, అహ్ అహ్ ||శంకర్‌||

చరణం 2

చేతకాని తనము టి.బి. అయితేనే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండితనము కలరా అయితేనేచూపు చూస్తే బాగుపడునులే
అన్యాయాలు, అధర్మాలు, అక్రమాలు కేన్సర్‌ అయితే అంతు
తేల్చు ఆన్సర్‌ ఉందిలే అరె మోసమన్న బి.పి. యమ స్వార్ధమన్న
షుగరు ప్రతి జబ్బుకు వైద్యముందిలే అరె అన్నింటికి ఒకే మందులే
ఏం మందుగురూ ||అ|| ఏంమందా
శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S. శంకర్ దాదాM.B.B.S.
ఓయ్‌ శంకర్ దాదాM.B.B.S., అరె జైబోలో శంకర్ దాదాM.B.B.S.
హు హ హు హ అరె శంకర్ దాదాM.B.B.S. హు హ హు హ ||4||