పల్లవి
[ఆమె] ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవు
ఏడతానున్నాడో బావం జాడ తెలిసినపోయిరావా
ఆ... అందాల ఓ మేఘమాల
ఆ... చందాల ఓ మేఘమాల
[అతడు] గగనసీమల తేలు ఓ మేఘమాలా...
మా ఊరిగుడిపైన మరలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో
మనసు చల్లగ చెప్పిపోవా నీలాల ఓ మేఘమాల
[ఆమె] మమతలెరిగిన మేఘమాలా నా మనసు బావకు చెప్పిరావా
ఇన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపగలు ఎదురు తెన్నులు చూచెనే
బావకై కనులు కాయలు కాచెనే ||అందాల||
[అతడు] మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచినగాని
కళ్ళు మూసినగాని మల్లిరూపే నిలచెనే నా చెంత మల్లిమాటే పలికెనే
జాలిగుండెల మేఘమాల నా బావలేనిదే బ్రతకజాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగ బావమొరల ||అందాల||
Showing posts with label - భానుమతి. Show all posts
Showing posts with label - భానుమతి. Show all posts
నీవేరా నా మదిలో - దేవా
పల్లవి
నీవేరా నా మదిలో - దేవా
తిరుమల వాసా! ఓ శ్రీనివాసా!
నీ పద దాసిని నేనేరా...
చరణం 1
ఎంతో మధురం నీ శుభనామం
జగతికి దీపం నీ దివ్యరూపం
ఆశల పూలే - దోసిట నింపే
వేచే భాగ్యము - నాదేరా
||నీవే||
చరణం 2
నీ మెడలోని కాంతులు చిందే
కాంచన హారం కాలేను నేను
నీ పదములపై చాలిన సుమమై
నిలిచే భారము నాదేరా...
||నీవే||
చరణం 3
నా జీవితం హారతి చేసి
నీ గుడి వాకిట నిలిచేను స్వామీ
నీ సన్నిధియే నా పెన్నిధిగా
మురిసే భాగ్యము నాదేరా
||నీవే||
నీవేరా నా మదిలో - దేవా
తిరుమల వాసా! ఓ శ్రీనివాసా!
నీ పద దాసిని నేనేరా...
చరణం 1
ఎంతో మధురం నీ శుభనామం
జగతికి దీపం నీ దివ్యరూపం
ఆశల పూలే - దోసిట నింపే
వేచే భాగ్యము - నాదేరా
||నీవే||
చరణం 2
నీ మెడలోని కాంతులు చిందే
కాంచన హారం కాలేను నేను
నీ పదములపై చాలిన సుమమై
నిలిచే భారము నాదేరా...
||నీవే||
చరణం 3
నా జీవితం హారతి చేసి
నీ గుడి వాకిట నిలిచేను స్వామీ
నీ సన్నిధియే నా పెన్నిధిగా
మురిసే భాగ్యము నాదేరా
||నీవే||
Subscribe to:
Posts (Atom)