Showing posts with label * గోపిక పూర్ణిమ. Show all posts
Showing posts with label * గోపిక పూర్ణిమ. Show all posts

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే... కల నేనౌతా
నా పాదం నువ్వైతే... నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే... వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై
సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ ||నా పెదవులు||

చరణం 1

కనిపించని బాణం నేనైతే...
తియతీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే... నేనెదురౌతా
వినిపించని గానం నేనైతే...
కవి రాయని గేయం నేనౌతా
శ్రుతిమించే రాగం నేనైతే... జతి నేనౌతా
దిగి వచ్చే నెచ్చెలి నేనౌతా
నిను మలిచె ఉలినే నేనైతే
నీ ఊహలు ఊపిరి పోసే
చక్కని బొమ్మను నేనౌతా ||నా పెదవులు||

చరణం 2

వేధించే వేసవి నేనైతే... లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే... మైమరపౌతా
నువ్వోపని భారం నేనైతే...
నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే... రారమ్మంటా
వణికించే మంటను నేనైతే...
రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే
ఎరుపెక్కిన చెక్కిలి పంచిన
చక్కెర విందే నేనౌతా ||నా పెదవులు||

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది...

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ.. ఇదేం అల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే.. ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా..
పేరు కైనా నేను లేనా..
దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. ||ఎక్కడ ఉన్నా||

చరణం 1

నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఎమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా...
ఓ... ||దీని పేరేనా|| ||ఎక్కడ ఉన్నా||

చరణం 2

కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ
మనసు మునుపు ఎపుడూ ఇంత
ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింతా
ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
ఓ... ||దీని పేరేనా|| ||ఎక్కడ ఉన్నా||

హే లే లే లే లే లేమ్మా

పల్లవి

హే లే లే లే లే లేమ్మా
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే
పుల్లు జాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి లెట్స్‌గో లెట్స్‌గో

చరణం 1

నిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపేపొంగే
అదుపు దాటి మనసేపొంగే నాలో
గడప దాటి వలపే పొంగే చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊహల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కునవోనువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా
ఈడుకి ||గాల్లో||

చరణం 2

తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
హద్దు దాటి హయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వ నానింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి ||గాల్లో||

నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా నేనేనాడు అనుకొని మైమరపులా

పల్లవి

నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా నేనేనాడు అనుకొని మైమరపులా ||2||
చిరుగాజుల్లె అలా రివ్వంటున్న సవ్వల్లలోన విన్నానులే ఇలా జుమ్మంటున్న రాగాల వీణ
సెగనిప్పుల్లే అల్లా చెరిగేస్తున్న మాసాలలోన కురిసిందిలే ఇలా నా ఎదలోన ఆ మంచు వాన
శతకోటి వర్ణాల సరికొత్త ఋతువల్లె ఈ లోకమే మారెనా ||నన్నొచ్చి||

చరణం 1

ఆ కారుపొగలైన మేఘాలుగా కనిపించెలే ఈ నాకంటికి
ఈ తీరు అదిఏమొ కొన్నాళ్ళుగా రుచిలేదులే ఈ నానోటికి
అలా చక్కనై అలై జాబిలి నన్నే తాకిపోయింది అవునా మరి
ఇలా నా మది అదేదో అయ్యి - ఎదో ఏదో అవుతోంది ఏమో మరి
అదో గుండమై నాకోసమే దిగివచ్చె ఆకాశమే ||నన్నోచ్చి||

చరణం 2

వేవేల తారల్ని కనువిందుగా విరభూసిలే ఈ పూదోటలే
నాకేమొ తొలిసారి మహవింతగా తరువాయెలే ఈ ఆ మాటలే
ఒక్కో దిక్కులా కుక్కుపిట్టలా రెక్కేకట్టి ఎగిరాయి నాఊహలే
నిద్రేపట్టని ఇదేం పిచ్చని నన్నే చూసి నవ్వాయి జడపువ్వులే
అలా నింగిలో నెలవంకనే గెలిచాయి నా ఆశలే||నన్నొచ్చి||