శ్రీమన్మహారాజ మార్తాండతేజా ప్రియానందభోజా
మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి మిము వరించి
మీ గురించి ఎన్నో కలలు గన్న
కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో
శాయంగల విన్నపములు
వచనం
సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు...
ఎన్నెన్నో కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద
రామ గోవిందా... జో... జో...
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ఊహు... ప్రేమ లేఖ ||తొలిసారి||
చరణం 1
ఏ తల్లి కుమారులో తెలియదుగాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదుగాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి ||2|| ||తొలిసారి||
చరణం 2
తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్... అబ్బా...
సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు
జాబిలి వాడే... ఆ... ఆ...
నీ జతనే కోరుకుని లతలాగా అల్లుకుని
నాకు మీరు మనసిస్తే... ఇచ్చినట్లు మాటిస్తే
ఇప్పుడే... బదులివ్వండి ||2|| ||తొలిసారి||
Showing posts with label - నరేష్. Show all posts
Showing posts with label - నరేష్. Show all posts
చినుకులా రాలి నదులుగా సాగి
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరచిపోబోకుమా... మమత నీవే సుమా ||చినుకులా||
చరణం 1
ఆకులు రాలి వేసవిగాలీ నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరె జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
శిశరమైనా... శిధిలమైనా...
విడిచిపోబోకుమా విరహమై పోకుమా
చరణం 2
తొలకరి కోసం తొడిమను నేనై
అల్లాడుతున్నానులే
పులకరమూదే పూవుల కోసం
వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నను నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసె
నీ ప్రేమ నా ప్రేమ తారాడే నా ప్రేమ
భువనమైనా... గగనమైనా...
ప్రేమమయమే సుమా... హా...
ప్రేమ మనమే సుమా... ||చినుకులా||
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరచిపోబోకుమా... మమత నీవే సుమా ||చినుకులా||
చరణం 1
ఆకులు రాలి వేసవిగాలీ నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరె జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
శిశరమైనా... శిధిలమైనా...
విడిచిపోబోకుమా విరహమై పోకుమా
చరణం 2
తొలకరి కోసం తొడిమను నేనై
అల్లాడుతున్నానులే
పులకరమూదే పూవుల కోసం
వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నను నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసె
నీ ప్రేమ నా ప్రేమ తారాడే నా ప్రేమ
భువనమైనా... గగనమైనా...
ప్రేమమయమే సుమా... హా...
ప్రేమ మనమే సుమా... ||చినుకులా||
Subscribe to:
Posts (Atom)