అల్లి బిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వీచే ఎదలో వెలుగై రావే
అల్లి బిల్లి కలలా రానా ఆహా...
అల్లుకున్న కధలా రానా ఆహా...
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వీచే ఎదలో వెలుగై రానా ||అల్లి||
చరణం 1
సోగకళ్ల విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏల బిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా ||అల్లి||
చరణం 2
జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా
వెండిమబ్బు తానై సంగతేదో తెలిపే
తలపే సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే దోర నవ్వు చినుకై
మేనికులుకే తేనె చినుకై పూలజల్లు కురిసే ||అల్లి||