Showing posts with label * ఉన్నికృష్ణన్‌. Show all posts
Showing posts with label * ఉన్నికృష్ణన్‌. Show all posts

ఓ చెలియా నా ప్రియసఖియా...

ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే ||ఓ చెలియా||

చరణం 1

ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ||ఓ చెలియా||

చరణం 2

కోకిలమ్మా నువు సయ్యంటే నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలి గాలులకు తెర చాపై నిలిచేనే
నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే ||ఓ చెలియా||

మనసా వాచా నిన్నే వలచా...

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచానే నీ నీడలా ||మనసా||

చరణం 1

చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా
మూగైపోయా నేనిలా... ||మనసా||

చరణం 2

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా... ||మనసా||

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ ||2||
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ ||పెదవే పలికిన||

చరణం 1

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా..
జో లాలి పాడనా.. కమ్మగా.. కమ్మగా ||పెదవే పలికిన||

చరణం 2

పొత్తిళ్ళో ఎదిగే బాబు..
నావొళ్ళో ఒదిగే బాబు..
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు..
నా కడుపున పుట్టేవాడు..
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ.. వాడి నాన్ననీ..
నూరేళ్ళు సాకనా.. చల్లగా.. చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూన..
ముద్దుల కన్నా జో.. జో
బంగరు తండ్రీ.. జో.. జో.. బజ్జో లాలి జో..
పలికే పదమే వినక కనులారా నిదురపో..
కలలోకి నేను చేరి తదుపరి
పంచుతాను ప్రేమ మాధురి ||ఎదిగీ||
బజ్జో లాలి జో.. బజ్జో లాలి జో..

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ||అచ్చొచ్చేటి ||
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా
విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా ||అచ్చొచ్చేటి ||

చరణం 1

మదన మోహినీ చూపులోన మాండురాగమేలా ||2||
పడుచువాడినీ కన్న వీక్షణ పంచదార కాదా
అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం ||2||
చందనం కలిసినా ఊపిరిలో
కరిగేనే కల కట్టినిల్లే ||శశివదనే||

చరణం 2

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా ||2||
నేను నీవు ఎవరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె ||2||
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జతచేరే ||నవమదనా||
ఆ... ఆ... నీదా...

రేపే లోకం ముగిసే

పల్లవి

[అతడు] రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు ||2||
[ఆమె] కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నులు నింపుకుని
ముందుకు ఒరిగే ఆఖరిసారిగా ప్రేమగా భువికే పొత్తులిచ్చే
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే ||రేపే||

చరణం 1

[ఆమె] రేపేలోకం రేపేలోకం ముగిసేనంటే నువు ఏం చేస్తావ్‌
[అతడు] ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి కన్నులేమూసుకుంటా
మరణం వరకూ మమతులు పంచి మరణాన్నే మరిపిస్తాలే ||రేపే||

చరణం 2

[అతడు] వలపు అనేది నిలిచెవరరు భూలోకం ముగియదులే
[ఆమె] కోటి మెరుపులు కోసేస్తున్నా ఆగదూ చెల్లదులే
[అతడు] ప్రణయాలెన్నో రాలిపోనీ జీవన యానం సొగునులే
[ఆమె] తనువే మైనా మనమేమైనా అనురాగం ఆగదులే
[ఆమె] రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు ||2||
[అతడు] నింగికి నేలకి వందన మంటూ నిను నాఒడిలో చేర్చుకుంటా
వెన్నెల విరుల పానుపువేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ నీ కావలినై నిలిచివుంటానే ||రేపే||

మధుర మధురతర మీనాక్షి

పల్లవి

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . ||2||
[అతడు] జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . ||2||
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా ||మధుర||

చరణం 1

[ఆమె] శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ
ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం
విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో
[అతడు] యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీనాక్షి
వరముల యమునై మమ్మేటి ప్రేమకి దిగిరావా

చరణం 2

[అతడు] అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
[ఆమె] తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసూ మనసూ ఒకటైన జంటకి ఇది సాక్షి

నీ పిలుపే ప్రేమగీతం

పల్లవి

[ఆమె] నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై
కవితలు పాడి . . . కవ్వించనీ కవ్వించనే కవ్వించనీ

చరణం 1

[అతడు] కళ్ళూకళ్ళూమూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మా ప్రేమా. . .
[ఆమె] నిద్దుర చెదిరి పోయెనమ్మ నేస్తంకోసం వెదికేనమ్మా ప్రేమా. . .
[అతడు] ఆడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ
[ఆమె] రమ్మంటూ పొమ్మంటూ పొమ్మంటూ రమ్మంటూ కవ్వించేదె ప్రేమ
[అతడు] ప్రేమలకు హద్దులేదులే దాన్ని ఎవ్వరయినా ఆపలేరులే ||నీపిలుపే||

చరణం 2

[ఆమె] జాతిలేదు మతములేదు కట్నాలేది కోరుకోదు ప్రేమా . . .
[అతడు] ఆదిలేదు అంతంలేదు లోకం అంతే తానైయుండును ప్రేమా . . .
[ఆమె] ఊరేదో పేరేదో కన్నోల్ల ఊసేదో అడగదు నిన్ను ప్రేమ
[అతడు] నాలోను నీవుండి నీలోను నేనుండి జీవించేదే ప్రేమ
[ఆమె] జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలయినా వీడిపోదులే ||నీపిలుపే||

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది

పల్లవి

[అతడు] లాలలా . . . లాలలా . . .
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది ||కన్నుల||

చరణం 1

[అతడు] గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
[ఆమె] ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది
[అతడు] ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో - ఆడే సందడిది
[ఆమె] అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని - తరిమి బంధమిది
[అతడు] కల చెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
[ఆమె] కల తరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా ||కన్నుల||

చరణం 2

[అతడు] పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు
తుళ్లి తుళ్లి ఆడుతున్నవి
[ఆమె] పంచలేని ఊహలే పంచవన్నె గువ్వలై
నింగి అంచు తాకుతున్నవి
[అతడు] కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళ
[ఆమె] వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈవేళ
[అతడు] అణువణువును తడిపిన ఈతడి అమృతవర్షిణి అనుకోనా
[ఆమె] అడుగడుగున పచ్చని బాటలు
పరిచిన వనమున చూస్తున్నా ||కన్నుల||

ప్రేమప్రేమ విరహం నీపేరా

పల్లవి

ప్రేమప్రేమ విరహం నీపేరా ||2||
ప్రేమ ప్రేమ నిలయం నీ ఊరా
పన్నీటిలో పడవల్లే కడలినడిపినా
కన్నీటిలో పడదోసి నిజం తెలిసినా
మరపురాని గురుతైనా వమ్మి ||ప్రేమ||


చరణం

యతపడిమురిసే జంటల ఒడిలో
గాలై కురిసే నీలి మేఘమా
ఇన్నాళ్ళు ఎదలను మీటిన అనురాగం నీవేనా
కన్నీళ్ళే వరముగ పొంగిన ఈ త్యాగం నీదేనా
బదులే రాదే మంచు మౌనమా ||ప్రేమ||

ఇప్పటి కిప్పుడు రెప్పల్లో

పల్లవి

ఇప్పటి కిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల వత్తిళ్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో
మనసును మేలుకొమ్మని కదిపి కుదిపి సరదాల సందడి
ప్రేమకు వేళయ్యిందని తరిమి తడిమి తరుణాల తాకిడి
ఏం చెయ్యమంది కొంటే అల్లరి ఆమాట చెప్పదు ఎల్లా మరి
మాటలేని ఒడ్డు చేరుకోమని
చిలికి చిలికి ఉలికిపడే చిలిపి వలపు చినుకు సడి ||ఇప్పటి||

చరణం 1

[ఆమె] సరసకు చేరలేదు ఇన్నాళ్లు అలజడి రేపుతున్న తొందర్లు
పరిచయమైన లేదు ఏనాడు శిరసును వంచమన్న బిడియాలు
సరదాగా మెదలైన శృతి మించే ఆటలో
నను నేనే మరిచానా మురిపించే మత్తులో
[అతడు] ఏమైనా ఈ మాయ బాగుందిగా
ఆకాశ మార్గాన సాగిందిగా
ముడి పడిపడి వీడనంది నూరెళ్ల సంకెల ||ఇప్పటి||

చరణం 2

[ఆమె] కనపడలేదు మునుపు ఏనాడు కనులకు ఇన్నివేల వర్ణాలు
తెలియనే లేదు నాకు ఏనాడు తలపునకు గిల్లుతున్న వైనాలు
పెదవుల్లో విరబూసే చిరునవ్వుల కాంతిలో
ప్రతిచోట చూస్తున్నవి ఎన్నెన్ని వింతలో
[అతడు] తొలిసారి తెలవారే నీయీడుకి
గిలిగింత కలిగింది ఈనాటికి
జతపడి సాగమంది కైగిళ్లవాడకి ||ఇప్పటి||

సాగే నీలి మేఘం ఆడు మౌనం రాగం

పల్లవి

[అతడు]సాగే నీలి మేఘం ఆడు మౌనం రాగం
[ఆమె] మధువనుల ఋతువులే యెద పొదలో విరియగా
శత ఇంధ్రధనస్సులో నయనాల మెరియగా
[అతడు] చిందులాడే జంటలే అందుకోగా అంబరాల అంచులో హంసల (సాగే . . .)

చరణం 1

[అతడు] మదినే మాయ చేసి నీ దోబూచు ఆటలు
నిజమా ప్రేమకింక చూపేనా బాటలు
[ఆమె] గాలి గుండెల జాలమాడినా చల్లని మమతకు
ఆశపడినా తోడ తలలే దొరకునా చివరకు
[అతడు] ఈ ఆశలే విధి ఆటలై ఎడబాటు లేక మిగిలా
ఆ శిధిలా శిశిరమెటులా గడప గలవని

చరణం 2

[అతడు] పొంగే మేటి రధమే నీ చేతితో ఆపినా
తీరం చేరుకోగా నదిలోనే ఆగునా
[ఆమె] ప్రేమ తలుపులు రామ చిలుకకు ఎవరు నేర్పారని
కోయిలమ్మల తేనెపాటలు పలికే ఈ ప్రకృతి
[అతడు] వలపన్నది కలకాదని ముమ్మాటికి నిజమని
[ఆమె] నీ యొదను యొదలతో కలిపే సొదలు వినమని (సాగే . . .)

హాయిర హాయిర హాయి రబ్బా

పల్లవి

[అతడు]హాయిర హాయిర హాయి రబ్బా ||2||
ప్రేమగుర్తు తాజ్‌మహల్‌ ప్రేమక
ప్లైట్‌ తెచ్చిన నందనవనంలా మేనక ||హైరా||
[అతడు] పాస్ట్‌సైజ్‌ వెన్నెలిలోన మేనక
ప్యాక్స్ లొచ్చిన ఆకలితనాదేవక
[ఆమె] ముసుర వాన నిను తడిపేనా... కురులితోటి తడితుడిచేనా
[అతడు] నిన్ను నేను కప్పుకొనేనా పెదవిపైనే పవళించేనా
పట్టు పువ్వ పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వవా ||హైరా||

చరణం 1

[అతడు] కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రటి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనేవి పాడగా చెల్లీకి వైరకునకు
సమాధినిల్‌ అని చెడగొడదాం
[ఆమె] నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితొ గాలై తిరుగకు
ఏమైనదో నీ వయసుకు ఆయాశమో, ఆవేశమో
[అతడు] పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు

చరణం 2

జర్రీపూలతోచే గాలి చెవిలో చెప్పను ఐలవ్‌యు
సైకస్‌ చెట్లలో దాగూర్‌పక్షి నాతో అన్నది ఐలవ్‌యు
నీ ప్రేమనే నువు తెలుపవా గాలులూ... పక్షులూ...
ప్రేమ చుట్టమై కుమిలినవి
[అతడు] ఒంటిగాలిలో పువ్వై నిలిచెను చిగురులలో నిలిచేందుకే
పూమాలలో పువ్వెట్టనా చిందే చినుకులు నేలవాలెను
నీ బుగ్గలె... ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా
[ఆమె] హృదయ సవ్వడిన నిలిచిన నువ్వు
ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నను నువు విడిస్తే మరుక్షణముండదు నా ప్రాణం ||హైరా||

పూవుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం

పల్లవి

[అతడు]పూవుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోక చిలుక పళ్లెంతో అతిశయం
వేణులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందె నీవేనా అతిశయం
ఆ గిరులు ఈ విరులు ఏ జనులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయాన పరువంతో అందరికి పుట్టూటి
ప్రేమేగా అతిశయం ||పూవుల్లో||

చరణం 1

ఏవాసనలేని కొమ్మలపై సువాసన కల్గిన్న పూలున్నయ్‌
పూలవాసన అతిశయమే
ఆ సంద్రం విచ్చిన మేఘంలా ఒక చిటికెడయినా
వుప్పుందా వాననీరు అతిశయమే
[అతడు] విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా వెలిగేటి
మిణుగురు లతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం
లోన ప్రేమ ఏచోట
నున్నదో ఆలోచిస్తే అతిశయమే
ఆగిరులు [అతడు] ||పువుల్లా||

చరణం 2

[అతడు] అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్లంట
నడిచొస్తే నీవేనా అతిశయము
జగమున అతిశయాలు ఏదైనా ఓమాట్లడే
పూవాన ఎనిమిదవ అతిశయమే
నింగిలాంటి నీ కళ్లు పాలుగారే చెక్కిల్లు తేనెలూరే
అధరాలు అతిశయము
మగువ చేతి వేళ్లు అతిశయమే మకుటంలాంటి గోళ్లు
అతిశయమే కదిలే ఒంపులు అతిశయమే ||ఆగిరులు|| ||పువుల్లా||

రోజా రోజా...

పల్లవి

రోజా రోజా...
రోజా రోజా రోజా రోజా ||6||
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగివచ్చా
నిను గాలిసోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే ||రోజా||

చరణం 1

కన్నులలో కొలువున్నావులే
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలుపగా నన్ను చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నారోజా
నీ పేరు నానోట నే చెప్పనా
నాఇంట రోజాలు పూచేనులే
నీజాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీరాకే మరుక్షణం తెలుపును వేగమే
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా ||రోజా||

చరణం 2

నవ యువతీ నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా
బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నారోజా రోజా ||రోజా||