పల్లవి
[ఆమె]అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే
[అతడు] మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
చరణం 1
నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై నా గుండెలుతడి
వెయ్యవా ఓ గొలుసువై నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వే
[అతడు] నీ చీకటి కరిగించనా కొవొత్తినై
నీ భయమును తొలిగించనా తాయతునై
నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై
[ఆమె] వేలే పట్టెయ్ ఉంగరమయ్య నాతో తిరిగెయే బొంగరమయ్యి
ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ బంగరమయ్యి
[అతడు] ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా ఊపిరిగా
మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా
కొంచెం పెంచనా - 3 ||అదరకొట్టు||
చరణం 2
నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై
[ఆమె] నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై
[అతడు] ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా -3 ||అదరగొట్టు||
Showing posts with label * వాసు. Show all posts
Showing posts with label * వాసు. Show all posts
Subscribe to:
Posts (Atom)