Showing posts with label * చిరంజీవి. Show all posts
Showing posts with label * చిరంజీవి. Show all posts

తమ్ముడు అరె

పల్లవి

హేహే హేహే హేహే హేహే
[చిరు] తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌటుంటే
నువు బెదరవుకదా నా మాటింటే
అమ్మడూ హోయ్ అమ్మడూ నువ్వు మరీ పరాగ్గా వుంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్‌ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు
మెగాస్టార్ . . . ధాంక్యూ ||తమ్ముడు||

చరణం 1

[అతడు] మీరంత బాగా పాడగలరని
మేము అస్సలనుకోలేదు మాస్టార్
[చిరు] ఇంతవరకు నేనూ ఎప్పుడూ పాడలేదు ఇదే ఫస్టుటైమ్‌
[అతడు] సార్ మొదటిసారి మీరు అదరగొట్టేసారు సార్‌
[చిరు] హ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా
హమ్‌ చేయాలనిపించింది చేసానంతే
[అతడు] మాస్టార్ ఈపాటకు మంచి స్టెప్ కలిసిందంతే అదురుతుంది
[చిరు] డాన్సేగా చాలా బాగుంటుంది చెయ్యండి
హే మేము కాదు మాస్టార్ మీరు
[చిరు] నేను డాన్సా . . . నోనోనో
ప్లీజ్‌సార్‌ ప్లీజ్
[చిరు] ఓకే
హే సూపర్ట్ మీ లెక్చరే సూపర్ట్ ||2||
[చిరు] వేలవేల భాషలున్నా నేలమీద ఎక్కడైనా
ప్రేమ గ్రామరొక్కటే లవ్వర్‌ ఆలాంగ్వేజ్ తెలియనిదెవరు
మూగ సైగలైన చాలు వేడి ఊపిరైన చాలు
గుర్తు పట్టలేరా ప్రేమికులు అవి అచ్చుతప్పులేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లీషు ప్రేమ ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
హ ఏకమయ్యే ఏకాంతమలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాడు కొత్తవాడు నల్లవాడు తెల్లవాడు
ప్రేమదేశ మెళ్లగానే మానవుడుగా మిగులుతాడు ||తమ్ముడు||

చరణం 2

హేహే సూపర్ట్ మీ లెక్చరే సూపర్ట్ ||2||
[చిరు] లక్షలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న
అక్షరాలు మాత్రం రెండు అది మహాసముద్రం ప్రెంఢ్
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న
మహా నవల రాసాడు ఆస్టోరీ కొట్టదు బోరు
" క " గుణింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
హ కాఫీ టీలే తాగనివాళ్లు దేవదాసులు అయిపోతారు
అమ్మడూ ఓ అమ్మడూ లబ్‌డబ్‌ హార్ట్‌బీట్‌
లవ్వు లవ్వు అన్నదంటే హైక్లాస్‌
లోక్లాస్‌ చూసుకోదు ప్రేమకేసు ||తమ్ముడు||

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్

పల్లవి

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్
ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్
ఈ ఛాయ్ గలాసుకీ జై జై ||ఛాయ్||

చరణం 1

డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు
డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ
లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు,
విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ
తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ,
ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి
అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ, తనుటీ తాగడంలో ఘునాపాటి
టీ వల్ల లాభాలు శతకోటి,
ఆ లిస్టంతా అవుతుంది రామకోటి ||ఛాయ్||

చరణం 2

అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం
మసాలా టీ అంటే అది దించునురా మైకం
లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం
ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం
కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో
ఎక్కడైనా దొరికేది ఏంటీ - టీ టీ
సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ - టీ అన్నా
టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు
టీ కొడితేనే బతుకుతారు అందరూ ||ఛాయ్||
[చిరు] ఎలా ఉందండీ
ఆ సూపర్
[చిరు] ఆ . . . లేకపోతే ఛాయ్‌ని ఛీ ఛీ అంటారా
ఇంక అనను
[చిరు] ఉంటానండీ