హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామ హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి ||వెన్నెల్లో||
చరణం 1
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన
వదల తరమా మదికి వశమా చిలిపి తనమా
చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా ||వెన్నెల్లో||
చరణం 2
గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి
అసలు తను ఎల్లావుందో ఏం చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే
కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కలల హంస
మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ
మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నదీ ||వెన్నెల్లో||
Showing posts with label - కల్యాణి. Show all posts
Showing posts with label - కల్యాణి. Show all posts
Subscribe to:
Posts (Atom)