పల్లవి
[ఆమె] వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంటా
చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేమి కావాలి నిద్దరవుతు వుంటే తను పక్కనుండాలి
ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి ||వల్లంకి పిట్ట||
చరణం 1
[ఆమె] జరిసనిసమపరిస జరిసనిసమపరిస
సగమనినిపమగ సగమనినిమమగమ
ప్పప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిస ప్పప్పా మగమ్మమ్మా గసగ్గ గ్గాసనిస
[ఆమె] చిరు చిరు మాటలు పలికే వేళ చిలకదిష్టి
బుడి బుడి అడుగుల వేసే వేళ హంసదిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండ నువ్వే చూడాలి ||వల్లంకి పిట్ట||
చరణం 2
[ఆమె] ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా
ఆకలేయగా బుల్లి బొజ్జలో దొంగనవుతా
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా
ఎక్కెక్కి ఏడ్చేవేళ కన్నీళ్ళవుతా నేస్తాన్నవుతా, గురువు అవుతా,
పనిమనిషి తన మనిషి అవుతా నే చెప్పేప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి
[పాప] వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లంగా రమ్మంటా
మా మంచి పాట సింహాద్రి పాట మనసారా వినమంటా
తమ తియ్యనిపాటే అమ్మపాడే లాలి తన తోడే వుంటే అది దీపావళి
మా ఇద్దరం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి ||వల్లంకి పిట్ట||
Showing posts with label * డి. ఐశ్వర్య. Show all posts
Showing posts with label * డి. ఐశ్వర్య. Show all posts
Subscribe to:
Posts (Atom)