మూసిన ముత్యాలకేలే మొరుగులు

పల్లవి

మూసిన ముత్యాలకేలే మొరగులు ఆసల చిత్తానికేలే అలవోకలు . . . 1

చరణం 1

కందులేని మోమునకేలే కస్తూరి
చిందు నీ కొప్పనకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పైకమ్మని నీమేనికి ||మూసిన||

చరణం 2

ముద్దు ముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||మూసిన||