జగడపు చనువుల జాజర

పల్లవి

జగడపు చనువుల జాజర సగీవల మంచపు జాజర

చరణం 1

మొల్లలు తురుములు ముడిచిన బరువున సరసపు మురుపేమున
జిల్లన పుప్పొడి జారగ పతిపై చల్లె రతివలు జాజర

చరణం 2

భారపు కుచములపై పైకడు సింగారపు నెరపెడి గంధవొడి
చేరువపతిపై చిందగ పడతలు సారెకు చల్లేరు జాజర

చరణం 3

బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదుల్ నించేరు సుంకుమదంబుల జాజర ||జగడపు||