అస్మదీయ మగటిమి - తస్మదీయ తకధిమి

పల్లవి

అస్మదీయ మగటిమి - తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు - భంగభంగారె భంగా
[ఆమె] వలపే ఇటుదులిపే - చెలి ఒయ్యారంగా కధలే ఇక నడిపె - కడుశృంగారంగా
[అతడు] పెనుగొండ ఎడనిండ రగిలించి వెన్నెల హలా . . .

చరణం 1

[ఆమె] నీపని - నీచాటు పని రసలీల లాడుకున్న నీ రాజసాల పని
[అతడు] మాపని . . . అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
[ఆమె] ఎపుడుపుడుడని ఎద ఎద కలిపే ఆపని
[అతడు] రేపని చురిమాపని పనిక్షణమాపని ఆపని
[ఆమె] పపపపనీ పనిగ గసని పనీ మమమమమనీ మపనీ
[అతడు] ఆపేఈ ఏదో ఇపుడే తెలుపనీ
[ఆమె] వలపనీ ||అస్మదీయ||

చరణం 2

[ఆమె] ఓసఖీ . . . రాకెందు ముఖి ముద్దులాడు యుద్ద రంగాన ముఖాముఖి
[ఆమె] ఓసఖా . . . మదునుని జనకా ఈ సందిట కుదరాలి మనకు సంధియిక
[అతడు] ఋతువున కొకరుచి మరిగిన మన సయ్యాటికి
[ఆమె] మాటికి మొగమాటవు సగమాటలు యేటికి
[అతడు] పపపపనీ పనిసగసనిపని మమమమనీ మపనీ
[ఆమె] పెళ్లికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి ||అస్మదీయ||