పల్లవి
అంతర్యామీ... అలసితి... సొలసితి...
ఇంతట శరణిదే జొచ్చితినీ... ||అంతర్యామీ||
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా...
భారపు పగ్గాలు - పాపపుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవని వద్దనకా ||2||
ఎదుటనె శ్రీ వేంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామీ... అంతర్యామీ... అంతర్యామీ... అలసితీ... సొలసితి...