కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ||2||
కొండలంత వరములు గుప్పెడువాడు ||కొండలలో||
చరణం 1
కుమ్మర దాసుడైన కురువరత్తినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ||కుమ్మర||
దొమ్ములు చేసినయట్టి
తొండమాన్ చక్కురవర్తి ||2||
రమ్మన్న చోటికి వచ్చి నమ్మీనవాడు ||దొమ్ములు|| ||కొండలలో||
చరణం 2
అచ్చపు వేడుకతో అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్నుమోచినవాడు ||అచ్చపు||
మచ్చిక దొలక
తిరుమల నంబి తోడుత ||2||
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||మచ్చిక|| ||కొండలలో||
చరణం 3
కంచిలోననుండ...
కంచిలోననుండ తిరుకచ్చినంబి మీద ||2||
కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ||కంచి||
ఎంచనెక్కుడైన వేంకటేశుడు... ||2||
మనలకు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలకు ||ఎంచ||
మంచివాడై కరుణ పాలించినవాడు ||ఎంచ|| ||కొండలలో||