పొడగంటిమయ్యా మిమ్ము

పల్లవి

పొడగంటిమయ్యా మిమ్ము పూరుషోత్తమా ||3||
మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా ||పొడగంటి||

చరణం 1

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా ||2||
చాలా - నేరిచి పెద్దలిచ్చిన నిధానమా ||కోరి||
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా ||2||
మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ||గారవించి|| ||పొడగంటి||

చరణం 2

భావింప కైవసమైన పారిజాతమా ||3||
మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణి ||భావింప||
కావించి కోరికలిచ్చే కామధేనువా ||2||
మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా ||కావించి|| ||పొడగంటి||

చరణం 2

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ||3||
ఓం నమో వేంకటేశాయా ||2||
రోగాలడచి రక్షించే
దివ్యౌషధమా ||చెడనీక||
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా ||2||
మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాధుడా ||బడి|| ||పొడగంటి||