పల్లవి
అదివో . . . అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలవలయము
చరణం 1
అదె - వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస ముఖిలమునులకు అదె
చూడుడదే మ్రొక్కుడానందమయము
చరణం 2
కైవల్యపదము వేంకటనగమదిలో శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపదరూప మదివో పావనములకెల్ల
పాపనమయము