రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం

పల్లవి

రాదు కదా ఆ నిమిషం ఈ నిమిషం చేదు విషం
నీవు అనే నా ప్రాణం నీతోనె ఇక పయనం
కలరాని ఆరిజారిపోయె కంటి రెపరెపలో
శిలమీద రాలిపాలిపోయె పూలగుమగుమలో||రాదుకదా||

చరణం 1

ఈ జగమే మనమై ఒదిగేలా హత్తుకున్నాములే ఒక్కరల్లే
ఈ మనసు మనసు కలిసేలా ముట్టుకున్నాములే ముద్దులల్లే
కన్నీల్లైనా గుండెలో గంగలు యమునలై
నూరేళ్ళైనా చాలనీ తలపులు తపనలే
నీ కొరకే నా ధ్యానం అ: నీ వెనకే నా ప్రాణం
కనులే తడిసే వలపు చినుకులివి ||రాదుకదా||

చరణం 2

జత కలిసి కసక తింటుంటే కాకి ఎంగిళ్ళి కవ్వింతలాయె
ఏ చిలిపి చిచిపో అంటుంటే తమ్మెదేలోన తళ్ళింతలాడే
కాలాలన్నీ వేసవి గాలులై తాకెలే
కాటేస్తున్నా వెన్నెలే జోలలే పాడెలే
నను మరచిపోతున్నా
నా మనిషే అనుకున్నా మనసే మురిసే మెరుపుకలలుఇవి ||రాదుకదా||