పల్లవి
నోటిలోన వేలి పెడితె కొరకలేనివాడు వీడు నావాడు
తోటకూరకి పాలకూరకి తేడా తెలియనివాడు వీడునావాడు
ఆల్ ఆంధ్రా అమాయకులకి అధ్యక్షుడు మావాడు
అనుకున్నా నిన్నటి వరకే కాదంటూ కధనడిపాడు ||నోటిలోన||
చరణం 1
ఎలాగ ముందుకు వెళ్ళాడు ఎలాగ మొదలెట్టాడు
ఇలాంటి ముద్దుల గుమ్మడిని ఎలా ముంచినాడు
ఎలాంటి సైగలు చేసిందో ఎలాంటి వల వేసిందో
ఈమె ఇలాంటి తుంటరి పనులన్నీ ఎలా తెలుసుకుందో
మన్మధుడే మఫ్తీలో వచ్చాడే మాస్టారై పాఠాలే చెప్పాడు
పట్టుతప్పి అడ్డంగా ప్రేమల్లో పడ్డాడు
చుట్టుపక్క అందర్ని పిచ్చోల్నే చేశాడు ||నోటిలోన||
చరణం 2
ఇవాళ పిలిచే పిలుపులకి ఎళ్ళుండి ఊ అంటాడు
వీడు ఇవాళ చెప్పే జోకులకి రేపు నవ్వుతాడు
నిదానమన్న పదానికి ముస్తాబు చేస్తె ఈమె
మోమాట మనం భావనకి మనిషి రూపు ఈమె
ఇద్దరికీ ఎట్టా కుదిరిందో ఈపైన ఇంకేకానుందో
షష్ఠిపూర్తి వరకైనా శోభనమే చేస్తారు
పిల్లలెప్పుడు పుడతారో వాల్లెట్టా ఉంటారో ||నోటిలోన||