వాన వాత్సాయన వయసార వాటేయనా

పల్లవి

వాన వాత్సాయన వయసార వాటేయనా
తేనె వరదాయెనా కనులార నినుతాకనా ఆ: నీవని మరి నేనని
దేహమె ఇకలేదని సరసాలాడ సఖియా నాతోరావ ||వాన వాత్సాయన||

చరణం 1

తొలిజల్లు కురిసింది తనవంతుగా చలిగాలి తరిమింది చెలచెంతగా
పడుచు ప్రాయాన పడితె ఈ వాన పరవసాలేగమైన
హరివిల్లు విరిసింది హరినల్లగా చిరుసిగ్గు కరిగింది మెలమెల్లగా
చిలిపి దాహాలు వలపు మోహాలు చిటికెలేసాయిలోన
జడివానలో ఎద తడిసిందిగా ఆ: జత చేరవా సిగ రగిలించగా
ఇక సరిలేని సఖియా నాతోరావ ||వానవాత్సాయన||

చరణం 2

వణికేటి పెదవుల్లొ వలపుందిగా నీ పెదవితో వరస కలిపిందిగా
లేత హృదయాలు ఏకమయ్యేల లేఖ రాస్తోంది వాన
ఉరికేటి వరదల్లో ఊపుందిగా నాకోరికే తాను చూపిందిగా
నేను నీలోన లీనమయ్యేల బాణమేస్తోంది వాన
ఈ నేలకు ఆ మేఘాలకు ఆ: స్నేహాలవారది వానేకదా
మరి నిను నన్ను కలిపింది తానే కాదా ||వానవాత్సాయన||