అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘంవుంది

పల్లవి

[అతడు]అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘంవుంది
మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకైయింది, చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకే నేల చిలకలు వాలే చెట్టైయ్యింది
నా చిలుక నువ్వే కావాలి, నా రాచిలుక నవ్వే కావాలి
రాగాల పువ్వే రావాలి, అనురాగాల మువ్వై మ్రోగాలి ||అనగా||

చరణం1

[అతడు] ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాళి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా. . .
కవ్వించగా ఆ. . .ఆ. . .ఆ. . .అ. . .
[ఆమె] ఆ. . .నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీ కేసి ||ఇద్దరు||
నువ్ చెవిలో చెప్పిన ఊసులకోసం నే వచ్చాసా పరుగులు తీసి ||నా చిలుక|| ||అనగ||

చరణం2

[అతడు] చుక్కలలోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నాకోసం
వేచి సాహసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించంగా
[ఇద్దరు] ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూంటే ||నా చిలుక|| ||అనగ||