ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా

పల్లవి

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఏనాటికి నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే నా ఆరోప్రాణం అంటున్నానే
కలకాలాలు నీతో చేరి ఉంటానేనే
ఇక నీతోనె ఏకం అవుతూ లోకాలె నే మరిచేన ||ఓ చంద్రమా||

చరణం 1

ఓ గోరింక నూరేళ్ళింక తోడే నీవై ఉండాలిలే
ఓ నామైనా ఏ జన్మాన నీకే జంటై ఉంటానులే
నీ గుండెలోన ఉన్నంత ప్రేమ ఆ కళ్ళలోన చూశా ఈ వేళ
చేశాక నిలపాలి బాస ఓ హొ హొ......
ఇచ్చాక మాట విడిచేన బాట విడిపోయే వరకు నా శ్వాస
ఓ చంద్రమ మచ్చేలేని ప్రియబంధమా
ఓ అంధమా నా ప్రియరాణి నీవే సుమా

చరణం 2

అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకు ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేనే నీతోన నేనవుతూ వేళ నీ పూల వాన
స్వప్నాలలోన నిలువెల్ల పూలకించి పోన హ హ ...
నేనే నీవైనా నావేణులోన రాగాలు రవళించుకోనా
ఓ అందమా నాప్రియరాణి నీవే సుమా ఏనాడిక నిన్నే వీడిపోలేనుగా
ఇక నీవే నా ఆరోప్రాణం అంటున్నాలే కలకాలాలు నీతో చేరి ఉంటానేనే
సఖి నీతోనె ఏకం అవుతూ లోకాలె నేమరిచేన
ఓ చంద్రమా అ: ఓ అందమా