అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా

పల్లవి

[అమె]అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
[అతడు] అరె చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియా షుక్రియా
సోడాలకు ముఖ్యం గోళి, పెళ్ళాలికి ముఖ్యం తాళి ఉండాలోయ్
పెన్నుకు పాళి షుక్రియా, షుక్రియా ||అరె||

చరణం 1

[ఆమె] హైటెక్కు సర్కారొస్తే నాయుడు బావకి షుక్రియా
[అతడు] బియ్యం ధర పెరిగిందండోయ్ బిజెపికి బోలో షుక్రియా
[ఆమె] ఎగ్జామ్స్ కి చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియా
[అతడు] కాన్వెంట్‌లో ఎల్‌కేజి లక్షలు అడిగితే బోలో షుక్రియా
[ఆమె] వంటింట్లో గ్యాస్ అయ్యిపోతే కుంపటి తల్లికి షుక్రియా
[అతడు] కాసుల కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఓడే గనులకు షుక్రియా
చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియా
[ఆమె] . . .

చరణం 2

[అతడు] గర్ల్‌ఫ్రెండును కలిసేటప్పుడు వాళ్ళన్నయ్య వస్తే షుక్రియా
పెళ్ళాము అనుకొని మరదలి చెయ్యెట్టస్తే బోలో షుక్రియా
ఏజైన యాక్టర్లందరు ఎమ్.పి. లైతే షుక్రియా
పెళ్ళాలని గద్దెక్కించే చాలూ గాళ్ళకి బోలో షుక్రియా
పట్టాలకి డైవర్స్ ఇచ్చే రైళ్ళకు బోలో షుక్రియా
[ఆమె] బస్సుల్ని పడవలు చేసి ఆర్టిసి కి షుక్రియా
[అతడు] నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియా
[ఆమె] తొలివారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియా ||అరె||