వన విహారం

వెళ్ళావా ఎప్పుడైనా వెళ్ళావా? కొండ దరిని అడవిలోకి వెళ్ళావా?
చూచావా తిరిగి తిరిగి చూచావా? రంగురంగు పిట్టలెన్నొ చూచావా?
ఆడావా పరుగులెత్తి ఆడావా? లేళ్ళూ కుందేళ్ళ తోడ ఆడావా?
పాడావా బిడియపడక పాడావా? పక్షులతో గొంతుకలిపి పాడవా?
తిన్నావా కఱవు తీర తిన్నావా? తియ్యనైన దోరపండ్లు తిన్నావా?
త్రాగావా కడుపునిండ త్రాగావా? చల్లని సెలయేటి నీళ్ళు త్రాగావా?
కోశావా అందినన్ని కోశావా? వింతవింత వన్నెపూలు కోశావా?
నేర్చావా స్వేచ్చ ఏమో నేర్చావా? కలసిమెలసి బ్రతుకు టేమొ నేర్చావా?