ఆవుపాలు అమ్మపాలు
అమృతమ్మే వానిపాలు
ఆవు చూపు అమ్మ చూపు
కన్న చలువ ఏది చూపు
ఆవు విలువ అమ్మ విలువ
కడలి లోని నిధుల విలువ
ఆవు ఋణము అమ్మ ఋణము
తీర్చలేని జన్మ ఋణము
ఆవు గుణము అమ్మ గుణము
సరిపోలదు దైవగుణము
విభాగములు: $ గుర్తు పాట మొదలయ్యే అక్షరాలను సూచిస్తుంది, * గుర్తు పాట పాడిన గాయని, గాయకుల పేర్లను సూచిస్తుంది, + గుర్తు సినిమా పేరుని సూచిస్తుంది, - గుర్తు కధానాయకుడు, కధానాయకురాలి పేర్లను సూచిస్తుంది, # గుర్తు ఎటువంటి పాటో సూచిస్తుంది. ఉదాహరణకు, భక్తి గీతాలు, సోలో పాటలు, యుగళ గీతాలు, దేశభక్తి గీతాలు, పిల్లల పాటలు.