ఆరు రుచులు

తీపీ తీపీ తియ్యని తీపి
పనసల తొనలూ పట్టుతేనెలూ
మనసుకు పట్టే తియ్యని తీపి
పులుపూ పులుపూ పుల్లని పులుపు
నిమ్మా చింతా దబ్బా రేగూ
పళ్ళకు పట్టే పుల్లని పులుపు
కారం కారం వర్రని కారం

నల్లని మిరియం ఎఱ్ఱని మిరపా
చెవులకు పట్టే వర్రని కారం
వగరూ వగరూ వదలని వగరు
పచ్చిది వక్కా పండని వెలగా
నోటికి పట్టే వదలని వగరు
చేదూ చేదూ గరళపు చేదు
వేపల పూతా కాకర పిందా
గొంతుకు పట్టే గరళపు చేదు

ఉప్పూ ఉప్పూ రుచికే ఉప్పు
సంద్రపు టుప్పూ సైంధవ లవణం
కడుపును పట్టే కారగు ఉప్పు
టీపీ పులుపూ ఉప్పూ కారం
చేదూ వగరూ కలగా పులగం
తగు పాళ్ళల్లో కమ్మని రుచులే