ఇంటికి కావలి కాచే దెవరూ? నేనే నేనే బౌ వౌ వౌ!
మామిడి కొమ్మన పాడే దెవరూ? నేనే నేనే కూ కూ కూ!
దోరపండ్లనే తొలిచేదేవరూ? నేనే నేనే కీర్ కీర్ కీర్!
తెలతెలవారగ లేపే దెవరూ? నేనే నేనే కొక్కొరోకో!
రాత్రిపూట భయపెట్టే దెవరూ? నేనే నేనే హూట్ హూట్ హూట్!
బండికి గిత్తల నిచ్చేదెవరూ? నేనే నేనే అంబా ఆ ఆ!
ఎలుకల పీడను మాపే దెవరూ? నేనే నేనే మ్యావ్ మ్యావ్ మ్యావ్!
వెచ్చని ఉన్నిని ఇచ్చే దెవరూ? నేనే నేనే బే బే బే!
చెఱువును శుభ్రం చేసేదెవరూ? నేనే నేనే క్వాక్ క్వాక్ క్వాక్!