చిక్కిందొక సింహం వలలో
అడలిందా దీన స్థితిలో
ఒక్క ఎలుక ఆ అరపులు విని
వచ్చె దాన్ని కాపాడాలని
ఎలుకని చూచిన ఆ సింహం
వేడుకొంది తానే పాపం
మంచిదానవే ఎలుకమ్మా
పులి అయినా తోడేలైనా
కనిపిస్తే చెప్పు రమ్మనీ
వలను తెంచి విడిపించమనీ
అపుడా మాటలు వింటూనే
నవ్విందా ఎలుక పక పకా
కొరికిందా వలను చకచకా
ఎంత పిచ్చి మారాజు వయా!
నీకు లోకమే తెలియదయా!
ఎదుట ఉన్న దెవరనుకొన్నావ్?
ఎందుకు వచ్చిందనుకొన్నావ్?
ఎంత చిన్న వాళ్ళం అయినా
పళ్ళ బలిమి చూపాలంటే
వలను కొరికి తెంపాలంటే
ఎలుక జాతికే అది సాధ్యం
పులికీ తోడేలు కసాధ్యం
అల్పులమైనా మృగరాజా
మమ్ముకూడా గుర్తించవయ్యా
అని మ్రొక్కిన ఎలుకకు సింహం
ఏమి ఇచ్చితే తీరు ఋణం?