కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది

పల్లవి

[అతడు] లాలలా . . . లాలలా . . .
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది ||కన్నుల||

చరణం 1

[అతడు] గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
[ఆమె] ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది
[అతడు] ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో - ఆడే సందడిది
[ఆమె] అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని - తరిమి బంధమిది
[అతడు] కల చెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
[ఆమె] కల తరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా ||కన్నుల||

చరణం 2

[అతడు] పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు
తుళ్లి తుళ్లి ఆడుతున్నవి
[ఆమె] పంచలేని ఊహలే పంచవన్నె గువ్వలై
నింగి అంచు తాకుతున్నవి
[అతడు] కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళ
[ఆమె] వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈవేళ
[అతడు] అణువణువును తడిపిన ఈతడి అమృతవర్షిణి అనుకోనా
[ఆమె] అడుగడుగున పచ్చని బాటలు
పరిచిన వనమున చూస్తున్నా ||కన్నుల||