పల్లవి
రోజా రోజా...
రోజా రోజా రోజా రోజా ||6||
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగివచ్చా
నిను గాలిసోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే ||రోజా||
చరణం 1
కన్నులలో కొలువున్నావులే
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలుపగా నన్ను చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నారోజా
నీ పేరు నానోట నే చెప్పనా
నాఇంట రోజాలు పూచేనులే
నీజాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీరాకే మరుక్షణం తెలుపును వేగమే
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా ||రోజా||
చరణం 2
నవ యువతీ నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా
బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నారోజా రోజా ||రోజా||