పల్లవి
[అతడు]పూవుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోక చిలుక పళ్లెంతో అతిశయం
వేణులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందె నీవేనా అతిశయం
ఆ గిరులు ఈ విరులు ఏ జనులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం
పదహారు ప్రాయాన పరువంతో అందరికి పుట్టూటి
ప్రేమేగా అతిశయం ||పూవుల్లో||
చరణం 1
ఏవాసనలేని కొమ్మలపై సువాసన కల్గిన్న పూలున్నయ్
పూలవాసన అతిశయమే
ఆ సంద్రం విచ్చిన మేఘంలా ఒక చిటికెడయినా
వుప్పుందా వాననీరు అతిశయమే
[అతడు] విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా వెలిగేటి
మిణుగురు లతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం
లోన ప్రేమ ఏచోట
నున్నదో ఆలోచిస్తే అతిశయమే
ఆగిరులు [అతడు] ||పువుల్లా||
చరణం 2
[అతడు] అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్లంట
నడిచొస్తే నీవేనా అతిశయము
జగమున అతిశయాలు ఏదైనా ఓమాట్లడే
పూవాన ఎనిమిదవ అతిశయమే
నింగిలాంటి నీ కళ్లు పాలుగారే చెక్కిల్లు తేనెలూరే
అధరాలు అతిశయము
మగువ చేతి వేళ్లు అతిశయమే మకుటంలాంటి గోళ్లు
అతిశయమే కదిలే ఒంపులు అతిశయమే ||ఆగిరులు|| ||పువుల్లా||