సాగే నీలి మేఘం ఆడు మౌనం రాగం

పల్లవి

[అతడు]సాగే నీలి మేఘం ఆడు మౌనం రాగం
[ఆమె] మధువనుల ఋతువులే యెద పొదలో విరియగా
శత ఇంధ్రధనస్సులో నయనాల మెరియగా
[అతడు] చిందులాడే జంటలే అందుకోగా అంబరాల అంచులో హంసల (సాగే . . .)

చరణం 1

[అతడు] మదినే మాయ చేసి నీ దోబూచు ఆటలు
నిజమా ప్రేమకింక చూపేనా బాటలు
[ఆమె] గాలి గుండెల జాలమాడినా చల్లని మమతకు
ఆశపడినా తోడ తలలే దొరకునా చివరకు
[అతడు] ఈ ఆశలే విధి ఆటలై ఎడబాటు లేక మిగిలా
ఆ శిధిలా శిశిరమెటులా గడప గలవని

చరణం 2

[అతడు] పొంగే మేటి రధమే నీ చేతితో ఆపినా
తీరం చేరుకోగా నదిలోనే ఆగునా
[ఆమె] ప్రేమ తలుపులు రామ చిలుకకు ఎవరు నేర్పారని
కోయిలమ్మల తేనెపాటలు పలికే ఈ ప్రకృతి
[అతడు] వలపన్నది కలకాదని ముమ్మాటికి నిజమని
[ఆమె] నీ యొదను యొదలతో కలిపే సొదలు వినమని (సాగే . . .)