నీ పిలుపే ప్రేమగీతం

పల్లవి

[ఆమె] నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై
కవితలు పాడి . . . కవ్వించనీ కవ్వించనే కవ్వించనీ

చరణం 1

[అతడు] కళ్ళూకళ్ళూమూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మా ప్రేమా. . .
[ఆమె] నిద్దుర చెదిరి పోయెనమ్మ నేస్తంకోసం వెదికేనమ్మా ప్రేమా. . .
[అతడు] ఆడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ
[ఆమె] రమ్మంటూ పొమ్మంటూ పొమ్మంటూ రమ్మంటూ కవ్వించేదె ప్రేమ
[అతడు] ప్రేమలకు హద్దులేదులే దాన్ని ఎవ్వరయినా ఆపలేరులే ||నీపిలుపే||

చరణం 2

[ఆమె] జాతిలేదు మతములేదు కట్నాలేది కోరుకోదు ప్రేమా . . .
[అతడు] ఆదిలేదు అంతంలేదు లోకం అంతే తానైయుండును ప్రేమా . . .
[ఆమె] ఊరేదో పేరేదో కన్నోల్ల ఊసేదో అడగదు నిన్ను ప్రేమ
[అతడు] నాలోను నీవుండి నీలోను నేనుండి జీవించేదే ప్రేమ
[ఆమె] జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలయినా వీడిపోదులే ||నీపిలుపే||