పల్లవి
అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయనమః - 2
హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయనమః
నిజభీర కంభీర శభరీగిరి శిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్ధితానంత బ్రహ్మండరూపాయనమః ||అయ్యప్ప||
చరణం 1
పద్దెనిమిది పడిమెట్లపైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి
ఇరుముడులు స్పృశించి శుభులనుచు దీవించి జనకృందములచేరె జగమేలు స్వామి
తనభక్తులొనరించు తప్పులకు తడబడి ఒకప్రక్క కొరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ముకాగ ధీమంతుడైలేచి ఆకన్నె స్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగుపరుగున వచ్చె భువిపైకి నరుడై ||అయ్యప్ప||
చరణం 2
ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని రోజు శబరీషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామీ
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర కలిభీతి తొలగించు భూతాదినేత ||అయ్యప్ప||
చరణం 3
ఆద్యంత రహితమో నీ విశ్వరూపము అజ్ఞాన తిమిరమ్ము అణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు పడిమెట్లుగా మారె ఈ దోపు ఊపం
అమరులెల్లరు చేయు అమృతాభిషేకం, నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓ ... పదములకు మ్రొక్కగా ఒక్కొక్కలోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానదీ తీర శంపాల పాపాత్మ పరిమార్చు స్వామి, భక్తులను రక్షించు స్వామీ
శరణమయ్యప్పా - శరణమయ్యప్పా
శంభు విష్ణు తనయ శరణమయ్యప్పా - 2
స్వామియే శరణమయ్యప్పా - 2 ఓం శాంతి శాంతి శాంతిః - 2